భాజపాలో చేరమని తమ పార్టీ నాయకులను ఒత్తిడి చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. డబ్బు మూటలతో టీఎంసీని విడగొట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని కూచ్‌బెహార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మండిపడ్డారు. పార్టీని వీడి వెళ్తున్నవారిని 'అవకాశవాదులు'గా అభివర్ణించారు మమత.
" బంగాల్ తృణమూల్ అధ్యక్షుడు సుభ్రతా భక్షిను భాజపాలోకి రావాలని అడగటానికి ఆ పార్టీకి ఎంత ధైర్యం? సిద్ధాంతాలు లేని పార్టీ భాజపా. ఎన్నో ఏళ్ల నుంచి టీఎంసీకి సేవ చేస్తున్న వారే మా నిజమైన ఆస్తి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా భాజపాను ఓడిస్తాం. "
--మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి
ఇటీవల టీఎంసీ నాయకులే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందున.. దీదీ ఈ విధంగా స్పందించారు.
ఇదీ చదవండి : 18న షా సమక్షంలో కమలం గూటికి సువేందు!