ETV Bharat / bharat

దిల్లీ రాజకీయాల్లో 'ఆక్సిజన్' రగడ - Sambit Patra

కరోనా రెండో దశ ఉద్ధృతిలో దిల్లీకి ఆక్సిజన్​ సరఫరాపై రాజకీయంగా దుమారం రేగింది. కేజ్రీవాల్ సర్కార్ తప్పుడు లెక్కలు చెప్పి, అవసరానికి మించి ప్రాణవాయువు పొందిందని భాజపా ఆరోపించగా.. ఆప్ తిప్పికొట్టింది.

oxygen
కేజ్రీవాల్​, భాజపా
author img

By

Published : Jun 25, 2021, 4:38 PM IST

దిల్లీలో మెడికల్​ ఆక్సిజన్​ సరఫరాపై రాజకీయంగా వివాదం నెలకొంది. ఈ విషయంలో దిల్లీ సర్కార్​​పై తీవ్ర ఆరోపణలు చేసింది భాజపా. కరోనా రెండో దశలో అవసరానికి మించి నాలుగు రెట్లు ఆక్సిజన్​ను​ ​సీఎం అరవింద్ కేజ్రీవాల్​ డిమాండ్​ చేసినట్లు ఆరోపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదికను ఉటంకిస్తూ.. విమర్శలు గుప్పించింది. సీఎం అరవింద్​ కేజ్రీవాల్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ధ్వజమెత్తింది.

కరోనా రెండోదశ ఉద్ధృతిలో దిల్లీ ప్రభుత్వానికి 209 మెట్రిక్ ​టన్నుల సరిపోయినప్పటికీ.. 1,140 మెట్రిక్​టన్నుల(ఎంటీ) ఆక్సిజన్​ డిమాండ్​ చేసిందని ఆరోపించారు భాజపా ప్రతినిధి సంబిత్​ పాత్రా. ఆ దశలో దిల్లీ ప్రభుత్వానికి 351 ఎంటీలు అవసరమని సుప్రీంకోర్టు కమిటీ అంచనా వేయగా.. కేంద్ర ప్రభుత్వం 289 ఎంటీలు చాలని పేర్కొందన్నారు.

"209 ఎంటీలు వినియోగించిన దిల్లీ ప్రభుత్వం.​. 1,140 ఎంటీలు డిమాండ్​ చేసింది. కేజ్రీవాల్ ఎంత దారుణానికి ఒడిగట్టారో.. దీని ఆధారంగానే ఊహించుకోవచ్చు. అవసరమైన దానికంటే నాలుగు రెట్లు డిమాండ్​ చేశారని ప్యానెల్ చెబుతోంది. కరోనా నిర్వహణలో విఫలమైన కేజ్రీవాల్..​ ప్రజల దృష్టిని మళ్లించడానికే రాజకీయాలు చేస్తున్నారు." అని అన్నారు సంబిత్​ పాత్రా.

ఆక్సిజన్​ లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని.. అందుకు కేజ్రీవాల్​ బాధ్యులని.. ఆయన్ను సుప్రీంకోర్టు శిక్షిస్తుందన్నారు సంబిత్​. కేజ్రీవాల్ అబద్ధాల కారణంగా దిల్లీ అవసరాలను తీర్చడానికి.. ఆక్సిజన్ సరఫరాను మళ్లించడం వల్ల 12 రాష్ట్రాలు ప్రభావితమయ్యాయని ఆయన ఆరోపించారు.

'నేను చేసిన నేరం ఏమిటి?'

"రెండు కోట్ల ప్రజల కోసం పోరాడాను.. అదేనా నేను చేసిన నేరం. మీరు(భాజపా) ఎన్నికల ర్యాలీలు బిజీగా ఉన్నప్పుడు.. నేను ఆక్సిజన్ ఏర్పాట్లు చేసేందుకు రాత్రిళ్లు మేల్కొని ఉన్నాను. ఆక్సిజన్ లేకపోవడం వల్ల ప్రజలు తమ ప్రియమైన వారిని కోల్పోయారని.. అబద్ధాలు చెప్పొద్దు. వారు చాలా తప్పుగా భావిస్తారు" అంటూ.. భాజపా వ్యాఖ్యలను కేజ్రీవాల్ ఖండించారు.​

భాజపా చెప్పినవన్నీ అబద్ధాలే..

మరోవైపు.. సుప్రీంకోర్టు ప్యానెల్​ నివేదిక గురించి భాజపా అబద్ధాలు చెబుతోందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా ఆరోపించారు. "అలాంటి నివేదిక లేదు. ఆక్సిజన్ ఆడిట్​కు సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ సభ్యులతో మేం మాట్లాడాం. అటువంటి నివేదికను ఆమోదించలేదని వారు చెప్పారు" అని సిసోడియా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'టీకా తీసుకుంటేనే ఉద్యోగులకు ఈ నెల జీతం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.