ఎక్కడా ప్రచారంలో పాల్గొనని వ్యక్తి ఎన్నికల్లో గెలుపొందాడు(bihar panchayat election 2021 winners list). ఎందుకంటే అతను నామినేషన్ల అనంతరం మృతిచెందాడు. అయితే సానుభూతి కారణంగానే గ్రామస్థులు అతన్ని ఎన్నుకున్నారు.
ఇదీ జరిగింది..
రాజధాని పట్నాకు 200 కిలోమీటర్ల దూరంలోని జమాయి జిల్లా దీపకర్‌హర్ గ్రామంలోని రెండో వార్డు అభ్యర్థిగా సోహన్ ముర్ము అనే వ్యక్తి బరిలో దిగాడు. అయితే.. అతను నవంబర్ 6న మరణించాడు. కానీ నవంబర్ 24న జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై 28ఓట్ల తేడాతో విజయం సాధించాడు.
ఈ ఘటన గురించి ముందే తెలిసి ఉంటే ఎన్నికలను వాయిదా వేసేవారమని ఖైరా బ్లాక్ అభివృద్ధి అధికారి(బీడీఓ) రాఘవేంద్ర త్రిపాఠి(bihar panchayat block development officer) తెలిపారు. అయితే మృతుడి చివరి కోరిక మేరకు గెలిపించిన గ్రామస్థుల ఐక్యతను ప్రశంసించారు.
"ఎన్నికల్లో గెలవాలన్నది ముర్ము చివరి కోరిక అని గ్రామస్థులు తెలిపారు. అందుకే అతని మరణంపై అధికారులకు సమాచారం కూడా ఇవ్వలేదు. అతని చివరి కోరికను గౌరవించేందుకు వారంతా ఓటేసినట్లు అనిపిస్తోంది"
-- రాఘవేంద్ర త్రిపాఠి, బీడీఓ
అయితే ప్రస్తుత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి ధ్రువీకరణ పత్రాన్ని అందివ్వబోమని త్రిపాఠి స్పష్టం చేశారు. 'వార్డు ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తాం' అని త్రిపాఠి చెప్పారు.
ఝార్ఖండ్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలో గిరిజన జనాభా ఎక్కువ. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 1990వ దశకంలో నక్సల్స్ కార్యకలాపాలు అధికంగా ఉన్న ప్రాతంగా దీనిని గుర్తించింది.
ఇవీ చదవండి: