బాలికను మురికి కూపంలోకి లాగేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయింది ఓ మహిళ. రాజస్థాన్‌కు చెందిన బ్రోకర్లకు బాలికను రూ.లక్షకు విక్రయించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందంగా ఏర్పడి అమ్మాయిని దుండగుల నుంచి విడిపించారు. బాలికను విక్రయించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకెంత మందిని ఇలా విక్రయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
బాధిత బాలిక బిహార్ గయా జిల్లాలోని డెల్హా పోలీసు స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. ఓ మహిళ ఆమెను ట్రాప్ చేసింది. మాయ మాటలు చెప్పి ఎలాగోలా రాజస్థాన్‌కు తీసుకెళ్లింది. అక్కడ అనైతిక వ్యాపారం చేసే ముఠాకు లక్ష రూపాయలకు బాలికను అమ్మేసింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డెల్హా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేసి బాలికను రక్షించారు.
ప్రత్యేక బృందం
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడింది. కేసు నమోదు చేసిన తర్వాత, గయా ఎస్ఎస్పీ ఆశిశ్ భారతి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. విషయాన్ని త్వరగా ఛేదించి, బాలికను దుండగుల ఎర నుంచి కాపాడాలని నగర డీఎస్పీ పరస్నాథ్ సాహు నేతృత్వంలో పలువురు ఎస్‌హెచ్‌ఓలతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఎస్‌ఎస్పీ ఏర్పాటు చేశారు. గయా పోలీసుల ప్రత్యేక బృందం.. ముఠాను పట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేసింది. 'బచ్‌పన్ బచావో' కార్యకర్తల సహాయంతో రాజస్థాన్‌లోని అనుమానిత ప్రదేశాలలో దాడులు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో అజ్మీర్‌లో బాలికను కనుగొనగలిగారు. పోలీసుల బృందం ద్వారా బాలికకు అనైతిక వ్యాపారం చేసే దుండగుల బారి నుంచి విముక్తి లభించింది.
నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
బాలికను మభ్యపెట్టి అనైతిక వ్యాపారం చేసే ముఠాకు అమ్మేసిన మహిళను కూడా గయా పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి పేరు సుప్రియ కుమారి(25) అని చెప్పారు. ప్రస్తుతం ఈమె ఫిష్ మోడ్ న్యూ గోదామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. ఈమె శాశ్వత అడ్రస్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముఫసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహ్దీగంజ్. ఈమె కుటుంబ నేపథ్యం, ఇంతకు ముందు ఏమైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇంకేమైనా జరిగాయా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు బాలికను అజ్మీర్ నుంచి సురక్షితంగా కాపాడి తన ఇంటికి చేర్చారు.
ఉద్యోగం పేరుతో...
మరోవైపు, మహారాష్ట్రలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. ఉద్యోగం పేరుతో మహిళలకు ఎర వేసి వ్యాపారంలోకి దించుతున్నారు. మంచి వేతనంతో కూడిన జాబ్ ఇప్పిస్తామని ఇద్దరు మహిళలను మోసం చేసిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళలను మిరారోడ్ ప్రాంతం నుంచి భీవండికి నిందితురాలు తీసుకొచ్చిందని పోలీసులు తెలిపారు. నిందితురాలు రుబీనా అలియాస్ రీనా ఆసిమ్ షేక్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆమెతో ఉన్న సాతిదార్ ముకుంద్ అనే వ్యక్తి పారిపోయినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: