ETV Bharat / bharat

కల్తీ మద్యం ఘటనలో 11కు చేరిన మృతులు - బిహార్​లో కల్తీ మద్య ఘటనలో మృతులు

Bihar hooch deaths: బిహార్​ నలంద జిల్లాలో కల్తీ మద్యం తాగి మృతిచెందినవారి సంఖ్య 11కు పెరిగింది. ఈ ఘటనకు సంబంధించి సోహ్​సరాయ్​ పోలీస్​ స్టేషన్ హౌజ్​ ఆఫీసర్​ను సస్పెండ్​ చేసినట్లు అధికారులు తెలిపారు.

Bihar hooch deaths
Bihar hooch deaths
author img

By

Published : Jan 16, 2022, 4:59 PM IST

Bihar Hooch Deaths: బిహార్‌ నలందలో కల్తీ మద్యం తాగి మృతి చెందినవారి సంఖ్య 11కు చేరింది. చనిపోయినవారంతా సోహ్​సరాయ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చోటీ పహాడీ, పహర్ తల్లి గ్రామాలకు చెందివారేనని అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించి సోహ్​సరాయ్ పోలీస్ స్టేషన్ హౌజ్​ ఆఫీసర్​ సురేష్ ప్రసాద్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.

మేజిస్ట్రేట్​ ఆగ్రహం

నలంద జిల్లా మేజిస్ట్రేట్ శశాంక్ శుభంకర్, ఎస్పీ అశోక్ మిశ్రా కూడా సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల బంధువులను ఆరా తీశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించినట్లు శశాంక్​ శుభంకర్​ పేర్కొన్నారు. చిన్న కొండ ప్రాంతాన్ని నాలుగు భాగాలుగా విభజించి మద్యం మాఫియాపై కూంబింగ్​ ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు. ఈ ఘటన వెనుక ఉన్నవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు.

2016 ఏప్రిల్​లో బిహార్​లో మద్యంపై నిషేధం విధించారు. దీంతో మద్యానికి బానిసైన కొందరు స్థానికంగా లభించే మందును తాగుతున్నారు! కొన్నిసార్లు కల్తీ మద్యం తాగడంతో మరణాలు సంభవిస్తున్నాయి. రెండు నెలల క్రితం ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అప్పడు 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: గోవా ప్రజలకు కేజ్రీవాల్ వరాలు.. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.