ETV Bharat / bharat

రాహుల్​ గాంధీని కలిసిన బిహార్​ ముఖ్యమంత్రి.. దాని గురించే చర్చ!

Nitish Kumar Rahul Gandhi : బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్.. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీని కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి గంట పాటు చర్చించారు. వివిధ రాజకీయ పార్టీల అధినేతలతో కుడా నీతీశ్ సమావేశం కానున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నంలో భాగంగానే నీతీశ్​.. నాయకులను కలుస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

bihar CM nitish kumar met rahul gandhi
bihar CM nitish kumar met rahul gandhi
author img

By

Published : Sep 5, 2022, 11:03 PM IST

Nitish Kumar Rahul Gandhi : బిహార్​ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్​ కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్​ గాంధీని కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి నేతలిద్దరూ చర్చించుకున్నారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే అంశంపై సమాలోచనలు చేశారు. నీతీశ్​, రాహుల్​ గాంధీ దాదాపు గంటపాటు చర్చించుకున్నారు. బిహార్​ జలవనరుల శాఖ మంత్రి మనోజ్ కుమార్​ ఝా కూడా నీతీశ్​ వెంట ఉన్నారు.
జనతా దళ్​ (సెక్యులర్​) అధ్యక్షుడు హెచ్​డీ కుమార స్వామిని కూడా కలిశారు నీతీశ్​.

అయితే ఎన్​డీఏతో తెగదెంపులు చేసుకున్న తర్వాత కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీని నీతీశ్​ కలవడం ఇదే మొదటి సారి. సోమవారం.. దిల్లీ చేరుకున్న నీతీశ్​, ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​, సీపీఎం​ కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్​, ఐఎన్ఎల్​డీ చీఫ్​ ఓం ప్రకాశ్ చౌతాలాను కూడా కలవనున్నారు. దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలన్నిటినీ ఏకం చేసే పనిలో నీతీశ్​ కుమార్​ నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే వివిధ పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇవీ చదవండి: స్కూల్ ఆవరణలో పిల్ల ఏనుగు హల్​చల్.. దారి తప్పి..!

పులికే పంజా విసిరి.. కుమారుడ్ని కాపాడుకున్న మహిళ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.