Bihar Alcohol News: బిహార్ నలంద జిల్లాలో ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపింది. వారి మరణానికి కల్తీ మద్యమే కారణమని మృతుల కుటుంబాల సభ్యులు ఆరోపిస్తున్నారు.
చనిపోయినవారంతా సోహ్సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొండ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామానికి చెందినవారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. వారి మరణానికి కల్తీ మద్యమే కారణమనే అంశంపై అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దర్యాప్తు పూర్తయ్యాకే అసలు విషయం తెలుస్తుందని చెప్పారు.
![Bihar alcohol news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14192367_imh1-2.jpg)
![Bihar alcohol news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14192367_imh1-4.jpg)
![Bihar alcohol news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14192367_imh1-1.jpg)
ఇదీ చదవండి: హాస్టల్లో ఒకేసారి 50మంది విద్యార్థులకు అస్వస్థత- ఏమైంది?