ETV Bharat / bharat

Biden G20 India Visit : దిల్లీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ఎయిర్​పోర్ట్​లో ఘన స్వాగతం - G20 Summit Guests

Biden G20 India Visit : జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు దిల్లీకి చేరుకున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. విమానాశ్రయంలో బైడెన్​కు కేంద్రమంత్రి వీకే సింగ్​ ఘనస్వాగతం పలికారు.

Biden G20 India Visit
Biden G20 India Visit
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 7:11 PM IST

Updated : Sep 8, 2023, 7:22 PM IST

Biden G20 India Visit : దేశ రాజధాని దిల్లీలో భారత్​ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ హస్తినకు చేరుకున్నారు. విమానాశ్రయంలో బైడెన్​కు కేంద్రమంత్రి వీకే సింగ్​ ఘనస్వాగతం పలికారు.

ఆస్ట్రేలియా ప్రధానికి ఘన స్వాగతం
Australia PM India Visit : జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌ దంపతులు.. దిల్లీకి చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి రాజీవ్​ సాదర స్వాగతం పలికారు.

పుతిన్​ తరఫున దిల్లీకి రష్యా విదేశాంగ మంత్రి..
Russian Foreign Minister India Visit : జీ20 సదస్సులో పాల్గొనేందుకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ .. శుక్రవారం దిల్లీకి చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరపున ఆయన ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

దక్షిణ కొరియా అధ్యక్షుడికి గ్రాండ్​ వెల్​కమ్​
South Korea President In India : దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్​ సుక్​ యోల్​.. జీ20 సమ్మిట్​లో పాల్గొనేందుకు భారత్​ చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయానికి వచ్చి యూన్ దంపతులకు కేంద్ర సహాయ మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​ ఘన స్వాగతం పలికారు.

దిల్లీకి ఒమన్​ ఉప ప్రధాని..
G20 Summit World Leaders : జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఒమన్ ఉప ప్రధానమంత్రి హెచ్‌హెచ్ సయ్యద్ అసద్ బిన్ తారిక్ అల్ సయీద్.. శుక్రవారం తెల్లవారుజామున దిల్లీకి చేరుకున్నారు. పలువురు అధికారులు.. ఆయనకు ఘనస్వాగతం పలికారు. మరోవైపు, ఐక్యరాజ సమితి సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెరెస్ కూడా​ దిల్లీకి చేరుకున్నారు. సాంస్కృత్రిక నృత్యాలతో ఆయనకు ఘనస్వాగతం లభించింది.

G20 Summit Guests : మరోవైపు సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే బ్రిటన్​ ప్రధాని రిషి సునాక్​, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఆఫ్రికన్‌ యూనియన్‌ ఛైర్‌పర్సన్‌ అజాలీ అసౌమని, ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టలినా జార్జివా, యురోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ దిల్లీకి చేరుకున్నారు. .

G20 Security Arrangements : డ్రోన్లు, బోట్లు, వేల మంది సిబ్బంది.. దిల్లీలో హైలెవల్ సెక్యూరిటీ

G20 Summit 2023 Delhi : 'భారత మండపం'లో జీ20 సదస్సు.. దిల్లీకి అగ్రదేశాల నేతలు.. పోలీసులు ఫుల్ అలర్ట్

Last Updated : Sep 8, 2023, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.