ETV Bharat / bharat

గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ (Gujarat Governor) ఆచార్య దేవవ్రత్ ప్రమాణస్వీకారం చేయించారు.

భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం
bhupendra patel
author img

By

Published : Sep 13, 2021, 2:23 PM IST

Updated : Sep 13, 2021, 2:44 PM IST

గుజరాత్ ముఖ్యమంత్రిగా (Gujarat CM) భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్​ (Gujarat Governor) సమక్షంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. గాంధీనగర్​లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనోహర్​ లాల్​ ఖట్టర్​, ప్రమోద్​ సావంత్​ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Bhupendra Patel
భూపేంద్ర పటేల్​ ప్రమాణం

మోదీ శుభాకాంక్షలు..

గుజరాత్​ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా భూపేంద్ర చేస్తున్న సేవలు తనకు తెలుసన్నారు. గుజరాత్​ అభివృద్ధికి ఆయన కచ్చితంగా దోహదపడతారని ధీమా వ్యక్తం చేశారు.

ప్రమాణస్వీకారానికి ముందు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీని (Vijay Rupani) కలిశారు పటేల్. గాంధీనగర్​లోని అధికారిక నివాసంలో రూపాణీని కలుసుకున్నారు. వివిధ అంశాలపై ఇరువురూ చర్చించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు, ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్​ను సైతం భూపేంద్ర కలిశారు.

Bhupendar Patel
భూపేంద్రతో అమిత్​ షా

అనూహ్య మార్పులు

రాష్ట్రంలో సీఎం మార్పు చకచకా జరిగిపోయింది. అప్పటివరకూ ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ రూపాణీ శనివారం అనూహ్యంగా రాజీనామా చేశారు. గాంధీనగర్​లో ఆదివారం జరిగిన భాజపా ఎమ్మెల్యేల సమావేశంలో భూపేంద్ర పేరును రూపాణీ ప్రతిపాదించగా... పార్టీ శాసనసభ్యులు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. భాజపా అధిష్ఠానం పంపించిన పరిశీలకులు.. నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్​ జోషి సమక్షంలో ఆ కార్యక్రమం జరిగింది.

భూపేంద్రది(Bhupendra Patel) ఘట్లోడియా నియోజకవర్గం. 2017 ఎన్నికల్లో 1.17లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో అదే రికార్డు. పైగా ఎమ్మెల్యే అభ్యర్థిగా భూపేంద్ర బరిలో దిగడం అదే తొలిసారి. అంటే.. అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలిసారే సీఎం పదవి చేపట్టారు.

ఇదీ చదవండి:

Last Updated : Sep 13, 2021, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.