యమధర్మ రాజు. ఈ పేరు వినగానే హిందువుల్లో ఏదో తెలియని భయం. దేశంలో ఎందరో దేవుళ్లకు ఆలయాలున్నా.. యముడిని ఆరాధించే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ యముడికి పరమభక్తుడైన ఓ వ్యక్తి ఆయనకు గుడి నిర్మిస్తున్నాడు.
కర్ణాటకలోని మండ్య జిల్లా బోర్ అనందూరు గ్రామానికి చెందిన రాజు.. యముడికి ఆలయాన్ని కట్టిస్తున్నాడు. గుడి నిర్మాణానికి కావల్సిన స్థలాన్ని కొనేశాడు. పనులు కూడా పూర్తయ్యాయి. కానీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు సిద్ధపడుతున్న తరుణంలో.. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయాన్ని కూల్చేశారు. జనవరి 18న విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయాలన్న రాజు ఆకాంక్ష నెరవేరలేదు. వెనకడుగు వేయకుండా.. తిరిగి పనులు ప్రారంభించాడు.
గతంలో శని శింగణాపురలో శని దేవునికి ఆలయాన్ని నిర్మించాడు రాజు. కొంతమంది భక్తులు రాజు అభిప్రాయానికి మద్దతుగా నిలుస్తున్నారు. యమధర్మరాజు హిందువుల భగవంతుడని, ఆయనను ఆరాధించాలని రాజు పిలుపునిచ్చారు.