ETV Bharat / bharat

భారత్‌లో టీకా పంపిణీ.. ప్రపంచానికి పాఠాలు! - Covaxin Corona vaccine

కొవిడ్​-19కు అడ్డుకట్టవేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాక్సిన్​లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. టీకా పంపిణీ విధానంలో మాత్రం అమెరికా సహా.. పలు దేశాలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. భారత్​ మాత్రం ఈ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతోంది. దేశవ్యాప్తంగా కోట్ల మందికి టీకా అందించాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న భారత్​.. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకొని పలు దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

WORLD BIGGEST VACCINE DRIVE IN INDIA
భారత్‌లో టీకా పంపిణీ.. ప్రపంచానికి పాఠాలు!
author img

By

Published : Jan 16, 2021, 5:31 PM IST

కరోనా వైరస్‌ విజృంభణతో అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలకు టీకా అందుబాటులోకి రావడం కాస్త ఊరట కలిగిస్తోంది. అయితే.. ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన కొన్నిదేశాలు మాత్రం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో ఒకటైన భారత్‌.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ పంపిణీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కోట్ల మందికి టీకా అందించేందుకు సన్నద్ధమైన భారత్​.. ఇందుకోసం ముందుగానే చేసిన ఏర్పాట్లు, ప్రణాళికలు ప్రపంచ దేశాలకు కొన్ని పాఠాలు నేర్పిస్తుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: కొవిడ్ టీకా సంజీవనిలా పనిచేస్తుంది: హర్షవర్ధన్

చతికిలపడుతోన్న ధనిక దేశాలు..

భారత్‌ కన్నా ముందే చాలా దేశాలు వ్యాక్సిన్‌ పంపిణీని చేపట్టాయి. అమెరికా వంటి ధనిక దేశాలు భారీస్థాయిలో టీకాలను నిల్వ చేసుకున్నాయి. కానీ.. ఊహించని పరిణామాలు, ప్రజల విముఖత, రవాణా సమస్యల కారణంగా పంపిణీలో మాత్రం వెనకబడ్డాయి. అలాంటి ఇబ్బందులు ముందుగానే పసిగట్టిన భారత్‌, పటిష్ఠ ప్రణాళికతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. ముందుగా వ్యాక్సిన్‌ ఎవరికి, ఎంత మందికి ఇవ్వాలనే అంశాలపై స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. ఇప్పటివరకు టీకా పంపిణీ ప్రారంభించిన ఏ దేశం కూడా భారత్‌లాంటి సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లలేదని వాషింగ్టన్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌కు చెందిన నిపుణులు వెల్లడించారు.

ఇదీ చదవండి: టీకా వేయించుకున్న సీరమ్‌ అధినేత

యూరప్‌ దేశాల్లోనూ వెనకడుగే.!

కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన తొలి దేశంగా నిలిచినట్లు రష్యా గతంలో ప్రకటించుకుంది. అంతేకాకుండా అత్యవసర వినియోగం కింద టీకా పంపిణీని చేపడుతోంది. అయితే.. ప్రజల నుంచి ఆశించినంత స్పందనను పొందడంలో మాత్రం విఫలమయ్యింది. ఇప్పటివరకు అక్కడ కేవలం 15లక్షల మందికి మాత్రమే టీకాలు ఇచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న 27 దేశాల ఈయూలోనూ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. అయితే.. అక్కడి టీకా పంపిణీ కాస్త మందకొడిగానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ వంటి దేశాల్లో టీకా తీసుకునేందుకు ప్రజలు అంతగా ఆసక్తి కనబరచడం లేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ సరఫరాలో ఆలస్యం, ఏర్పాట్లు సహా.. ప్రజలను ముందస్తుగా మానసికంగా సిద్ధం చేయడంలో పలుదేశాలు విఫలమవుతున్నట్లు అంతర్జాతీయ వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: కొవిడ్​ జ్ఞాపకాలు తలచుకొని మోదీ కన్నీటిపర్యంతం

ముందస్తు ఏర్పాట్లు..

ధనిక దేశాల్లో టీకా పంపిణీ ఇలా ఉన్న నేపథ్యంలో.. టీకా పంపిణీ కోసం భారత్ మాత్రం‌ భారీ ఏర్పాట్లే చేసినట్టు తెలుస్తోంది. తొలుత దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. తర్వాత వీటి సంఖ్యను పెంచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయా కేంద్రాలకు వ్యాక్సిన్‌ను ఎప్పటికప్పుడు సరఫరా చేసేందుకు దేశవ్యాప్తంగా 12 వ్యాక్సిన్‌ ప్రధాన కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ రిఫ్రిజిరేషన్‌ సౌకర్యాలనూ ఏర్పాటు చేసింది. ఉత్పత్తి కేంద్రాల నుంచి నేరుగా విమానాల్లో ఈ ప్రధాన కేంద్రాలకు తరలించి.. అక్కడ నుంచి అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాలకు సరఫరా చేయనుంది. ఈ పనితీరును పరీక్షించేందుకు ఇప్పటికే రెండుసార్లు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ చేపట్టింది. వాటిలో ఎదురైన లోటుపాట్లను సరిదిద్దుకుంది. వీటితోపాటు ప్రత్యేకంగా రూపొందించిన కో-విన్‌ యాప్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకొనే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసింది. ఇలా ముందస్తు ప్రణాళికతో భారీ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఇదీ చదవండి: టీకా తీసుకున్న మొదటి ఎంపీ ఆయనే

భారత్‌కు కలిసొచ్చే అంశాలు..!

వ్యాక్సిన్‌లు సురక్షితమైనవే అనే విశ్వాసం ఇక్కడి ప్రజల్లో ఉండటమూ భారత్‌కు కలిసివచ్చిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పోలియో టీకా వంటి కార్యక్రమాలను భారత్‌ సమర్థవంతంగా నిర్వహించడం కూడా వ్యాక్సిన్‌ పంపిణీ సులభతరం కావడానికి అనుకూలమైన అంశాలని చెప్పారు. అంతేకాకుండా స్వదేశంలోనే వ్యాక్సిన్‌ తయారుకావడం సహా.. అవి సురక్షితమేనని ప్రభుత్వం ప్రకటించడం వల్ల వ్యాక్సిన్‌ పంపిణీ సజావుగానే సాగుతుందనే నమ్మకం ఉందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేల్లోనూ పలువురు వ్యాక్సిన్‌ తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నట్లు వెల్లడైంది.

ఇదీ చదవండి: దేశంలో 116కు చేరిన కొత్త రకం కరోనా​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.