ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగులకూ వర్క్​ ఫ్రం హోమ్!

కరోనా మహమ్మారి కారణంగా కార్యాలయాలన్నీ.. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం తప్పనిసరి చేశాయి. ప్రభుత్వ శాఖలు సైతం ఈ విధానాన్నే అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో లాక్​డౌన్ తర్వాత కూడా వర్క్​ ఫ్రం హోమ్​ కొనసాగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ విధానం వల్ల మంచి ఫలితాలు వస్తున్నందున ఇందుకోసం నూతన మార్గదర్శకాలు రూపొందించే పనిలో ఉంది.

Work from home
ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోమ్!
author img

By

Published : May 14, 2020, 1:34 PM IST

ప్రభుత్వ ఉద్యోగులకు ఇక నుంచి 'వర్క్​ ఫ్రం హోమ్'(ఇంటి నుంచి పని) సాధారణం కానుంది. కరోనా తెచ్చిన ఈ పరిస్థితి లాక్​డౌన్​ తర్వాతా కొనసాగనుంది. తక్కువ సిబ్బంది, వేర్వేరు పని గంటల్లో ఉద్యోగులు విధులు నిర్వర్తించే అవకాశం లభించనుంది. ఈ మేరకు లాక్​డౌన్​ అనంతరం వర్క్​ ఫ్రం హోమ్​కి సంబంధించిన మార్గదర్శకాలను.. సిబ్బంది మంత్రిత్వ శాఖ రూపొందించింది.

కరోనా మహమ్మారి వల్ల చాలా వరకు కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇంటి నుంచే పని చేయాల్సిన అవసరం ఏర్పడిందని సిబ్బంది శాఖ వ్యాఖ్యానించింది. అందువల్ల భౌతిక దూరం నిబంధనలను పాటించడానికి భవిష్యత్తులో పరిమితమైన సిబ్బందినే కొనసాగించే అవకాశం ఉందని పేర్కొంది. అర్హత కలిగిన అధికారులు, సిబ్బందికి సంవత్సరంలో 15 రోజుల పాటు ఇంటి నుంచి పని చేసుకునే సౌలభ్యం కల్పించే అవకాశం ఉన్నట్లు ముసాయిదాలో పేర్కొంది.

"లాక్​డౌన్ సమయంలో జాతీయ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్​(ఎన్​ఐసీ) అందించే ఈ-ఆఫీస్, వీడియో కాన్ఫరెన్స్​ సదుపాయాలను ఉపయోగించి చాలావరకు కేంద్ర ప్రభుత్వ శాఖలు మంచి ఫలితాలు రాబట్టగలిగాయి. భారత ప్రభుత్వానికి ఇలాంటి అనుభూతి ఇదే తొలిసారి. అందువల్ల లాక్​డౌన్ తర్వాతా.. వర్క్​ ఫ్రం హోమ్ కొనసాగించడానికి సరైన మార్గదర్శకాలు అవసరం. ఇంటి నుంచే పని చేసే సమయంలో.. ప్రభుత్వ సమాచార భద్రతకు భంగం కలగకుండా విస్తృతమైన ఫ్రేమ్​వర్క్ రూపొందించడం అత్యావశ్యకం."­- సిబ్బంది శాఖ

ఉద్యోగుల పని ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగడానికి కొత్త మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. వర్క్​ ఫ్రం హోమ్​కు అవసరమైన సామాగ్రి(ల్యాప్​టాప్​, డెస్క్​టాప్​)ని ఆయా మంత్రిత్వ శాఖలే అందించనున్నట్లు సిబ్బంది శాఖ స్పష్టం చేసింది. అంతర్జాలానికి అయ్యే ఖర్చు కూడా రియంబర్స్​మెంట్​ రూపంలో తిరిగిపొందవచ్చని పేర్కొంది. వీఐపీలు, పార్లమెంట్​కి సంబంధించిన విషయాలపై పనిచేసే శాఖలకు మరింత ప్రోటోకాల్​ను జోడించనున్నట్లు వెల్లడించింది.

వాటిపై దృష్టి

ఇప్పటివరకు ఈ-ఆఫీస్​ మాడ్యూల్​ని ఉపయోగించని శాఖలపై మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. దశలవారిగా కార్యాలయాలన్నింటిలో ఈ-ఆఫీస్ విధానాన్ని అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ప్రస్తుతం 75 మంత్రిత్వ శాఖలు ఈ-ఆఫీస్ విధాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇందులో 57 శాఖలు 80 శాతానికి పైగా పనిని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాయి.

సున్నిత సమాచారం భద్రమే

వర్క్​ ఫ్రం హోమ్​లో భాగంగా ప్రభుత్వ డేటాబేస్​లో ఉండే సున్నితమైన సమాచారం, డాక్యుమెంట్లను ఈ-ఆఫీస్​ ద్వారా యాక్సెస్ చేయడం కుదరదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. సమాచార భద్రత కోసం ప్రస్తుతమనున్న ప్రోటోకాల్స్​ను పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని ఎన్​ఐసీకి సూచించింది.

ఇదీ చదవండి: రైలు ప్రయాణికుల అడ్రెస్​లు నమోదు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.