ETV Bharat / bharat

8 నెలల బిడ్డతో కలిసి తల్లి ఆత్మహత్య - సూసైడ్​ న్యూస్​

ఝార్ఖండ్​లో విషాద ఘటన జరిగింది. ఎనిమిది నెలల పసిబిడ్డపై కిరోసిన్​ పోసి.. తానూ ఆత్మహత్యకు పాల్పడింది ఓ మహిళ. మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని చూడలేకే ఇలా చేసిందని స్థానికులు చెబుతున్నారు.

woman eight month old ill son die after self immolation in jharkhand
కిరోసిన్​ పోసుకుని తల్లీబిడ్డ ఆత్మహత్య!
author img

By

Published : Oct 7, 2020, 3:19 PM IST

కన్నబిడ్డ అనారోగ్యంతో కలత చెందిన ఓ మహిళ.. తనతో పాటు, తన కుమారుడి ప్రాణాలను బలితీసుకుంది. కిరోసిన్​ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఝార్ఖండ్​లోని నాలా పోలీస్​ స్టేషన్​ పరిధిలో గల సూరీయాపాని గ్రామంలో జరిగింది ఈ ఘటన.

మూడు నెలలుగా...

గ్రామానికి చెందిన వైశాఖి ముర్ము(25) తన ఎనిమిది నెలల కుమారుడితో కలిసి పుట్టింట్లో ఉండేది. తన భర్త రంజీత్​ తుడు వేరే చోట పని చేస్తూ.. డబ్బులు పంపించేవాడు. అయితే తన కుమారుడు మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైంది ముర్ము.

అందరూ నిద్రపోతున్న సమయంలో.. ఇంటి నుంచి బయటకు వచ్చిన వైశాఖి... కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకుంది. తల్లీబిడ్డల అరుపులకు మేల్కొన్న స్థానికులు... మంటలను ఆర్పారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: కేరళలో అత్యాచార దోషి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.