వాహనాలకు ఫాస్టాగ్‌లు జారీ చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతున్న నేపథ్యంలో జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద స్పీడ్ బ్రేకర్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారు అధికారులు. టోల్ గేట్ల వద్ద అతిస్వల్ప సమయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే పలు టోల్ గేట్ల వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్లు తొలగిపోయి ప్రయాణం సాఫీగా సాగుతోంది.
ఇక ఫాస్టాగ్ జారీ ప్రక్రియ కూడా వేగవంతంగా సాగుతోంది. జనవరి 1నాటికి 1.15 కోట్ల ఫాస్టాగ్‌లు జారీ చేశారు అధికారులు.
ఇదీ చూడండి: 1.15 కోట్ల మార్కును దాటిన ఫాస్టాగ్‌ల జారీ