కేంద్ర ప్రభుత్వంపై ఇటీవల విమర్శల ట్వీట్ల వర్షం కురిపిస్తున్న రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఫిబ్రవరి-జులై వరకు కరోనా కాలంలో కేంద్రం సాధించిన విజయాలంటూ తాజాగా చేసిన ట్వీట్‌కు అదే తీరులో జవాబిచ్చారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్. ఆయా నెలల్లో రాహుల్ సాధించిన విజయాలంటూ పలు విషయాలతో చురకలంటించారు.
"రాహుల్ గాంధీ ప్రతిరోజు ట్వీట్ చేస్తున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ట్వీట్లకే పరిమితమైందని అనుకుంటున్నా. కాంగ్రెస్ పని చేయట్లేదని అనేందుకు ఒకదాని తర్వాత ఒక రాష్ట్రం సాక్ష్యంగా నిలుస్తోంది. తిరస్కరణకు గురైన పార్టీ కేంద్రంపై అన్ని విధాల దాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ వారు అందులో విజయం సాధించరు."
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర మంత్రి
రాహుల్ గాంధీ సాధించిన ఘనతలను వివరించారు జావడేకర్. అవి..
- ఫిబ్రవరి: షాహీన్బాఘ్ అల్లర్లు
- మార్చి: జోతిరాదిత్య సింధియా సహా మధ్యప్రదేశ్‌లో అధికారం కోల్పోవటం
- ఏప్రిల్: వలస కార్మికులను రెచ్చగొట్టటం
- మే: సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ చారిత్రక ఓటమికి 6వ వార్షికోత్సవం
- జూన్: చైనాకు సలహాలు ఇవ్వటం
- జులై: రాజస్థాన్‌లో పార్టీలో చీలికలు
-
Will tell Rahul Gandhi's achievements in last 6 months. Shaheen Bagh & riots in Feb, losing Scindia & MP govt in March, instigating labourers in April, 6th anniversary of historic poll defeat in May, advocating for China in June & party destroyed in Rajasthan in July: P.Javadekar https://t.co/2ftVRbBvAH pic.twitter.com/SEM5NtaLl9
— ANI (@ANI) July 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Will tell Rahul Gandhi's achievements in last 6 months. Shaheen Bagh & riots in Feb, losing Scindia & MP govt in March, instigating labourers in April, 6th anniversary of historic poll defeat in May, advocating for China in June & party destroyed in Rajasthan in July: P.Javadekar https://t.co/2ftVRbBvAH pic.twitter.com/SEM5NtaLl9
— ANI (@ANI) July 21, 2020Will tell Rahul Gandhi's achievements in last 6 months. Shaheen Bagh & riots in Feb, losing Scindia & MP govt in March, instigating labourers in April, 6th anniversary of historic poll defeat in May, advocating for China in June & party destroyed in Rajasthan in July: P.Javadekar https://t.co/2ftVRbBvAH pic.twitter.com/SEM5NtaLl9
— ANI (@ANI) July 21, 2020
-
ఇదీ చూడండి: కరోనా కాలంలో కేంద్రం సాధించిన విజయాలివే: రాహుల్