ETV Bharat / bharat

'ప్రభుత్వ సాయం లేకున్నా కుంభమేళా నిర్వహిస్తాం'

author img

By

Published : Dec 26, 2020, 6:44 PM IST

హరిద్వార్​లో మహా కుంభమేళా జరపడానికి ప్రభుత్వం సహకరించకపోతే.. తామే నిర్వహించాలని అఖిల భారత అఖాడా పరిషత్​(ఏబీఏపీ) నిర్ణయించింది. జనవరి నుంచి ప్రారంభం కానున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

Will organise Maha Kumbh on our own if Uttarakhand govt doesn't cooperate: Akhada parishad
'ప్రభుత్వ సాయం లేకున్న కుంభమేళా నిర్వహిస్తాం'

ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో వచ్చే ఏడాది జనవరి నుంచి జరగనున్న మహా కుంభమేళాకు ఏర్పాట్లు ప్రారంభించకపోవడం పట్ల ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది అఖిల భారత అఖాడా పరిషత్(ఏబీఏపీ)​. ఈ మహాకార్యానికి ప్రభుత్వం సహకరించకపోతే.. తమ శక్తి, సామర్థ్యం మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. కుంభమేళా కార్యకలాపాలపై చర్చించడానికి నయా ఉదాసిన్​ అఖాడా కంకల్​తో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గతసారిలా.. ఘనంగా..

కుంభమేళా విషయంపై సీఎం తివేంద్ర సింగ్​ రావత్​కు వినతి పత్రాన్ని సమర్పించినట్లు ఏబీఏపీ​ అధ్యక్షుడు మహాంతి నరేంద్ర గిర్​ తెలిపారు. "ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం ప్రభుత్వం బాధ్యత. అయితే ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నాం. అయితే ప్రభుత్వం సాయం ఉన్నా.. లేకపోయినా 2010లో జరిగినట్లు ఘనంగా నిర్వహిస్తాం" అని గిర్​ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మహా కుంభమేళాను ఘనంగా నిర్వహించమని కోరుతామన్నారు​.

2021 జనవరి నుంచి ఏప్రిల్​ వరకు హరిద్వార్​లో మహా కుంభమేళా జరగనుంది.

ఇదీ చూడండి: కరోనా కాలంలోనూ అదరగొట్టిన రైల్వే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.