ETV Bharat / bharat

నీట్​, జేఈఈ వాయిదాపై కాంగ్రెస్​ దేశవ్యాప్త ఆందోళనలు

author img

By

Published : Aug 27, 2020, 12:44 PM IST

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో నీట్​, జేఈఈ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలనుకోటంపై జాతీయ స్థాయిలో ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. శుక్రవారం అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన తెలపాలని నిర్ణయించింది. అదే రోజున 'స్పీక్‌ అప్‌ ఫర్‌ స్టూడెంట్‌ సేఫ్టీ' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్‌ ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది.

Will Modi govt guarantee no student will get Covid
కరోనా సోకదని మోదీ హామీ ఇవ్వగలరా?

దేశవ్యాప్తంగా నీట్‌, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్లు తీవ్రతరమవుతున్నాయి. విపక్షాలు ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నాయి. కానీ, కేంద్రం మాత్రం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించడానికే మొగ్గు చూపుతోంది. దాంతో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో ఆందోళనలు నిర్వహించడానికి సమాయత్తమవుతోంది. శుక్రవారం అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అదే రోజున ‘స్పీక్‌ అప్‌ ఫర్‌ స్టూడెంట్‌ సేఫ్టీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్‌ ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి అన్ని సామాజిక మాధ్యమ వేదికల్లో విద్యార్థుల తరఫున తన గళాన్ని వినిపించనుంది. ఈ పరీక్షల నిర్వహణపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, సిబ్బందికి వైరస్‌ సోకదని ప్రధాని మోదీ హామీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. ‘జేఈఈ, నీట్ నిర్వహించడంతోనే సుమారు 25లక్షల మంది విద్యార్థుల జీవితాలు ప్రమాదంలో పడనున్నాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నా..మోదీ ప్రభుత్వం వారి ఆవేదనను పట్టించుకోకుండా, ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని చూపడానికి ఎందుకు నిరాకరిస్తోంది’ అంటూ ట్విటర్‌లో విమర్శలు చేశారు. దిల్లీ ప్రభుత్వం కూడా ఇదే అంశంపై కేంద్రానికి లేఖ రాసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వైరస్‌ సోకిన దాఖలాలు కోకొల్లలంటూ దానిలో గుర్తుచేసింది. అలాగే పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ మాట్లాడుతూ..నీట్, జేఈఈ వంటి పరీక్షలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించాలని కేంద్రాన్ని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహాలో పరీక్షలు జరుగుతున్నప్పుడు, ఇక్కడ మాత్రం ఎందుకు సాధ్యం కాదన్నారు.

మరోవైపు, గోవా, బిహార్ ప్రభుత్వాలు మాత్రం ప్రవేశ పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 19వేల మంది విద్యార్థులు సెకండరీ, హైయ్యర్‌ సెకండరీ పరీక్షలకు హాజరయ్యారని, వారిలో ఒక్కరు కూడా కరోనా బారిన పడలేదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ వెల్లడించారు. ఎటువంటి భయాందోళనలు లేకుండా పరీక్షలకు హాజరు కావాలని బిహార్‌ ప్రభుత్వం విద్యార్థులను కోరింది.

కాగా, రెండు పరీక్షలకు సంబంధించి 99 శాతం మంది విద్యార్థులు మొదట ఎంచుకున్న పరీక్షా కేంద్రాన్నే వారికి కేటాయించామని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. విద్యార్థుల ఏడాది సమయాన్ని వృథా చేయలేమని, పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని విపక్షాలను కోరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.