ETV Bharat / bharat

'నేను విచారణకు హాజరవుతా.. కానీ' - దీప్​ సిద్ధూపై లుక్​ఔట్​ నోటీసులు

రైతుల ట్రాక్టర్​ ర్యాలీ రోజున ఎర్రకోట ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్​ సిద్ధూ.. తాను విచారణకు హాజరవుతానని తెలిపాడు. రెండు రోజుల సమయం ఇస్తే ఈ అంశంలో నిజాలను వెలికితీస్తానని చెప్పాడు.

Deep Sidhu
నేను విచారణకు హాజరవుతాను.. కానీ: దీప్​ సిద్ధూ
author img

By

Published : Jan 29, 2021, 11:39 AM IST

గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై సిక్కుల జెండా ఎగురవేసిన ఘటనతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్​ నటుడు దీప్​ సిద్దూ.. తాను పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతానని తెలిపాడు. అయితే కొన్ని నిజాలు బయటకు తీయాల్సి ఉందని, ఆ తర్వాతే విచారణకు హాజరవుతానని చెప్పాడు. ఈ అంశంలో తాను ఏ తప్పు చేయలేదని అన్నాడు. ఈ మేరకు ఫేస్​బుక్​ ద్వారా ఓ వీడియోను పంచుకున్నాడు దీప్​.

"నాపై అరెస్టు వారెంట్​, లుక్​ఔట్​ నోటీసులు జారీ చేశారు. నేను విచారణకు హాజరువుతానని ముందు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నా మీద వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవాలే. వాటితో ప్రజలు తప్పుదోవ పడుతున్నారు. ఇందులో నిజాలను వెలికితీసేందుకు రెండు రోజుల సమయం కావాలి. ఆ తర్వాతే నేను విచారణకు హాజరతాను. నిఘా సంస్థలను నేను వేడుకుంటున్నా. నేను ఏ తప్పూ చేయలేదు. అలాంటప్పుడు నేను ఎందుకు పారిపోవాలి? ఎందుకు భయపడాలి? ఈ విషయంలో నిజానిజాలు బయటకు వస్తాయి. "

- దీప్​ సిద్ధూ, పంజాబీ నటుడు

ట్రాక్టర్ ర్యాలీ హింస ఘటనలో దీప్ సిద్ధూపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దిల్లీ పోలీసులు. ఆయనతో పాటు మాజీ గ్యాంగ్​స్టర్ లఖా సిధానా, సామాజికవేత్త మేధా పాట్కర్, 37 మంది రైతు నేతలపై ఎఫ్ఐర్ దాఖలు చేశారు.

భద్రత కట్టుదిట్టం..

రిపబ్లిక్​ డే నాటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో దిల్లీలోని టిక్రి, సింఘు సరిహద్దు వద్ద భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. పారామిలిటరీ బలగాలు సహా దిల్లీ పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలోని అనేక రహదారులను ట్రాఫిక్​ పోలీసులు మూసివేశారు. గాజీపుర్​ సరిహద్దును మూసివేశారు.

గాజీపుర్​ వద్ద ఉద్రిక్తత

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతులను ఖాళీ చేయించేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఉద్యమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విరమించేది లేదని కరాఖండీగా చెబుతున్న అన్నదాతలు.. నేటి నుంచి ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే దిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్ధులోని గాజీపుర్ దీక్షాస్థలికి వేలాది మంది రైతులు చేరుకున్నారు. దీంతో యూపీ గేట్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.