ETV Bharat / bharat

బడాబాబుల రుణమాఫీపై భాజపా-కాంగ్రెస్​ ట్విట్టర్​ వార్​

author img

By

Published : Apr 29, 2020, 2:29 PM IST

ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు చెందిన రుణాలను కేంద్రం మాఫీ చేసిందని వస్తున్న ఆరోపణలపై స్పందించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్, రాహుల్​గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో కాంగ్రెస్ నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదని చెప్పారు.

nirmala
'ఉద్దేశపూర్వక ఎగవేతదారులే నాడు ఫోన్ బ్యాంకింగ్ కస్టమర్లు'

ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు చెందిన రూ.68,607 కోట్ల రుణాలను మాఫీ చేశారంటూ వస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్‌ విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తిప్పికొట్టారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులే యూపీఏ పాలనలో ఫోన్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా లబ్ది పొందారని వ్యాఖ్యానించారు. భాజపా మిత్రులు అవడం వల్లే ఈ రుణాలను కేంద్రం రద్దు చేసిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలపై స్పందించారు ఆర్థిక మంత్రి. యూపీఏ జమానా నాటి ఉద్దేశ పూర్వక ఎగవేతదారులు రుణాలను చెల్లించేలా మోదీ సర్కార్‌ వెంటాడుతోందని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.

  • @INCIndia and Shri.@RahulGandhi should introspect why they fail to play a constructive role in cleaning up the system. Neither while in power, nor while in the opposition has the @INCIndia shown any commitment or inclination to stop corruption & cronyism.

    — Nirmala Sitharaman (@nsitharaman) April 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రాహుల్ గాంధీ, రణ్​దీప్ సుర్జేవాలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరించి సంచలనాలుగా మలచే ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు."

-నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి

బ్యాంకింగ్‌ వ్యవస్ధను ఎందుకు ప్రక్షాళించలేదో రాహుల్‌ గాంధీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. 2009-10, 2013-14లో యూపీఏ హయాంలో బ్యాంకులు రూ.1,45, 000 కోట్ల రూపాయల రుణాలను రద్దు చేశాయని.. ఈ అంశమై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను అడిగి రాహుల్ తెలుసుకోవాలని సూచించారు నిర్మల. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అవినీతి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని ఆపడానికి ఎలాంటి చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించలేదని విమర్శించారు.

'వ్యవస్థ ప్రక్షాళన అంటే ఇదికాదు'

నిర్మల వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. బ్యాంకింగ్‌ వ్యవస్ధను ప్రక్షాళన చేయడం అంటే పరారీలో ఉన్న వ్యక్తులు, మోసగాళ్ల రుణాలను రద్దు చేయడం కాదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్‌ సుర్జేవాలా వెల్లడించారు. ఇది బ్యాంకింగ్‌ వ్యవస్థ నిర్మాణాన్ని ఆర్థికంగా, అవివేకంగా బలహీనపర్చడమే అని ఆయన ట్విట్టర్‌లో విమర్శించారు. నీరవ్‌ మోదీ, మోహుల్‌ చోక్సీ లాంటి ఎగవేతదారుల భారీ రుణాలను రద్దు చేసేందుకు మోదీ ప్రభుత్వానికి ఎవరు అనుమతిచ్చారని సూర్జేవాలా ప్రశ్నించారు.

  • और निर्मला जी, ₹6,66,000 के क़र्ज़ राइट ऑफ़ को “सिस्टम की सफ़ाई” नही, बैंक में जमा “जनता की गाढ़ी कमाई की सफ़ाई” कहते हैं।

    हम आपको व मोदी जी को यही कहेंगे -

    तू इधर उधर की बात न कर,
    ये बता की क़ाफ़िला क्यों लूटा,
    मुझे रहजनों से गिला नही,
    तेरी रहबरी का सवाल है। https://t.co/mjpyvgUVme

    — Randeep Singh Surjewala (@rssurjewala) April 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'రుణమాఫీ ఎగవేతదారుల కోసం కాదు'

రుణమాఫీ ఉద్దేశపూర్వక ఎగవేతదారుల కోసం కాదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేత చిదంబరం. నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ, విజయ్ మాల్యా వంటివారికి రుణాల మాఫీని వర్తింపజేయడం సరికాదన్నారు. బ్యాంకింగ్ నిబంధనల్లోని రుణమాఫీ అంశం ఎగవేతదారుల కోసం ఉద్దేశించింది కాదని వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆ సంస్థల కోసం అమెజాన్ ప్రత్యేక నిధి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.