ETV Bharat / bharat

'మన జవాన్లను నిరాయుధులుగా ఎందుకు పంపారు?'

లద్దాక్​​ సరిహద్దులో మన జవాన్లను ఆయుధాలు లేకుండా ఎందుకు పంపారని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మన సైనికులపై దాడిచేయడానికి చైనాకు ఎంత ధైర్యమని ట్వీట్​ చేశారు.

Why Indian soldiers were sent 'unarmed to martyrdom': Rahul
'మన జవాన్లను నిరాయుధులుగా ఎందుకు పంపారు?'
author img

By

Published : Jun 18, 2020, 12:31 PM IST

భారత్​-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులపై కేంద్రానికి ప్రశ్నాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. లద్దాక్​ సరిహద్దులో జవాన్లను నిరాయుధులుగా ఎందుకు పంపారని ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు. మన సైనికులను చంపడానికి చైనాకు ఎంత ధైర్యమని వ్యాఖ్యానించారు. భారత్​-చైనా సరిహద్దులో ఒకప్పుడు విధులు నిర్వహించిన మాజీ సైనికాధికారి ఇంటర్వ్యూను ట్వీట్​కు జత చేశారు రాహుల్​.

గాల్వన్​ లోయలో 20మంది జవాన్లు అమరులైన ఘటనకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ను బుధవారం ప్రశ్నించారు రాహుల్​. అమర వీరులకు నివాళి అర్పిస్తూ చేసిన ట్వీట్​లో చైనాను ఎందుకు ప్రస్తావించలేదని ట్వీట్​ చేశారు​. చైనా పేరు ప్రస్తావించకుండా సైన్యాన్ని అవమానించారని మండిపడ్డారు. జవాన్లు మరణిస్తున్నా ఎన్నికల ర్యాలీల్లో ఎందుకు పాల్గొన్నారని అడిగారు.

ఇదీ చూడండి: 'చైనా పేరును ప్రస్తావించడంలో భయమెందుకు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.