కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు ఢోకా లేదని రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన హామీపై భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ స్పందించారు. ఎంఎస్పీ ముగుస్తుందని తాము ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఎంస్పీపై చట్టాన్ని చేయాలని కోరినట్లు తెలిపారు. ఇలా చేస్తే దేశ ప్రజలందరికీ ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఇప్పటివరకు ఎంఎస్పీపై ఎలాంటి చట్టం లేదని చెప్పారు. కాబట్టి రైతులను ట్రేడర్లు దోచుకుంటున్నారని ఆరోపించారు.
ఎంఎస్పీ కొనసాగుతూనే ఉంటుందని రాజ్యసభ వేదికగా మోదీ స్పష్టం చేశారు. అదే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ సైతం కొనసాగుతుందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వ్యవసాయ చట్టాలపై రైతుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి: ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తోంది: మోదీ