దేశవ్యాప్తంగా బాణసంచా వాడకాన్ని నిషేధించాలని దాఖలైన వ్యాజ్యంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎస్ఏ నజీర్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. బాణసంచా కంటే వాహనాల నుంచి వెలువడే పొగే కాలుష్యానికి అతిపెద్ద కారకమని తెలిపింది. ఈ రెండింటిలో ఏది ఎక్కువ కాలుష్యం వెలువరిస్తుందనే విషయంపై అధ్యయనం జరిగిందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కాలుష్యానికి పెద్ద కారకంలా మారిన వాహనాల పొగను వదిలేసి బాణసంచాపై పడుతున్నారేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.
"బాణసంచా తయారీని నిషేధిస్తే దానిపై ఆధారపడ్డ కార్మికులు జీవనోపాధిని కోల్పొతారు. మేము నిరుద్యోగ పెరుగుదలను ఆహ్వానించలేం. బాణసంచా తయారీ, అమ్మకం చట్టబద్ధమైనప్పుడు ఎలా నిషేధిస్తారు? "
-సుప్రీం కోర్టు
దీపావళితో పాటు ఇతర పండుగల్లో బాణసంచా పేల్చేందుకు నిర్ణీత సమయాన్ని కేటాయిస్తూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. అంతేకాకుండా తక్కువ కాంతి, శబ్దం వెలువరించే హరిత టపాసులే వాడాలని ఆదేశించింది.
ఇదీ చూడండి:"రోడ్ షో, బైక్ ర్యాలీలను నిషేధించాలి"