ETV Bharat / bharat

'ఎన్​డీఏ ఇంకా ఉందా? ఉంటే ఏ పార్టీలున్నాయి?'

author img

By

Published : Sep 28, 2020, 1:35 PM IST

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్​డీఏ) నుంచి శిరోమణి అకాలీదళ్ (ఎస్​ఏడీ)​ వైదొలగడంపై భాజపాకు శివసేన పలు ప్రశ్నలు సంధించింది. ఎన్​డీఏలో మిగిలిన ఏకైక పార్టీ ఎస్​ఏడీ కూడా కూటమిని వీడింది. దీంతో ఎన్​డీఏ ఉనికి ప్రశ్నార్థకమైందని తన అధికార పత్రిక 'సామ్నా'లో ప్రత్యేక కథనం రాసుకొచ్చింది.

What is left of NDA after Akali Dal, Shiv Sena exit: Saamana
ఎన్​డీఏ కూటమి ఇంకా ఉందా?

వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ.. నేషనల్​ డెమోక్రటిక్​ అలియన్స్​ (ఎన్​డీఏ) నుంచి శిరోమణి అకాలీదళ్​ (ఎస్​ఏడీ) వైదొలగడంపై శివసేన స్పందించింది. ఎన్​డీఏ ఇంకా ఉందా? ఉంటే ఏయే పార్టీలు ఉన్నాయని ప్రశ్నిస్తూ.. తన అధికార పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో రాసుకొచ్చింది.

ఎన్​డీఏలో ఆఖరి స్తంభంగా నిలిచిన శిరోమణి అకాలీదళ్​.. కూటమి నుంచి వైదొలగక తప్పలేదని అభిప్రాయపడింది. హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​ కూటమి నుంచి వెళ్తున్న సమయంలో ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అంతకముందు శివసేన కూడా అదే తరహాలో ఎన్​డీఏను వీడింది. ఈ రెండు పార్టీలు బయటకు వచ్చిన తర్వాత ఎన్​డీఏలో ఇంకా ఏముందని ప్రశ్నించింది. ఒకవేళ ఉంటే.. వారికి హిందుత్వంతో సంబంధం ఉందా? అని ప్రశ్నల వర్షం కురిపించింది.

నిర్దిష్ట ఆకారానికి ముఖచిత్రాలుగా..

పంజాబ్​, మహారాష్ట్రలు ఎన్​డీఏకు నిర్దిష్ట ఆకారాన్ని ఏర్పరిస్తే.. అకాలీదళ్​, శివసేన పార్టీలు దానికి ముఖచిత్రంగా మారాయని పేర్కొంది సామ్నా. రెండు పార్టీలు వైదొలగినందున కూటమి ఉనికి ప్రశ్నార్థకమైందని పేర్కొంది.

ఇదీ కూటమి..

జాతీయ స్థాయిలో కాంగ్రెస్​ పార్టీకి వ్యతిరేకంగా.. తెలుగుదేశం పార్టీ (టీడీపీ), శివసేన, శిరోమణి అకాలీదళ్​తో ఎన్​డీఏ కూటమి ఏర్పడింది. తొలుత టీడీపీ ఎన్​డీఏను వీడగా.. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా శివసేన గతేడాది వైదొలగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల్ని నిరసిస్తూ.. అకాలీదళ్ కూటమి నుంచి బయటకొచ్చింది.

ఇదీ చదవండి: అధికారమిస్తే.. 10లక్షల ఉద్యోగాలు: ఆర్జేడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.