ETV Bharat / bharat

ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సై: ఐఏఎఫ్​ పైలెట్స్​ - భారత్​, చైనా ఉద్రిక్తతలు

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను మోహరిస్తోంది భారత్​. ఈ నేపథ్యంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత వాయుసేన సిద్ధంగా ఉందని లేహ్​ ఎయిర్​ బేస్​లోని పైలెట్లు చెబుతున్నారు. శీతాకాల ప్రతికూలతలను అధిగమించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

IAF pilots
భారత వాయుసేన
author img

By

Published : Oct 11, 2020, 6:35 AM IST

తూర్పు లద్దాఖ్​లో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ సన్నాహాలు ముమ్మరం చేసింది భారత్​. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు లేహ్​ ఎయిర్​ బేస్​లో మోహరించిన వాయుసేన పైలెట్స్​ పేర్కొంటున్నారు. ఏదైనా దాడి జరిగితే దానిని తిప్పికొట్టేందుకు సరైన యుద్ధ సామగ్రిని సమకూర్చుకున్నట్లు చెప్పారు.

శీతాకాలం వస్తున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేపట్టింది వాయుసేన. జవాన్లకు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచేలా చర్యల తీసుకుంటోంది. సరిహద్దుల్లో యుద్ధ విమానాలు ఆకాశంలో చక్కర్లు కొడుతూ నిరంతరం నిఘా పెట్టాయి. సీ-17 గ్లోబ్​మాస్టర్​, ఇల్యూషిన్​-76, ఆంటోనియా-32 రవాణా విమానాలతో పాటు అపాచీ, చినూక్​ వంటి హెలికాప్టర్లు, మిగ్​-29 యుద్ధ విమానాలను మోహరించారు.

ఈ ప్రాంతంలోని పశ్చిమ, ఉత్తర ప్రత్యర్థులను నిలువరించేందుకు వైమానిక దళం ఎలా సిద్ధమవుతోందన్న ప్రశ్నకు కీలక సమాధానమిచ్చారు మిగ్​-29 యుద్ధ విమానాన్ని నడిపిన లెప్టినెంట్​ హర్బరభ్​ సింగ్​. ఎలాంటి పరిస్థితికైనా వాయుసేన సిద్ధంగా ఉందన్నారు.

" ఏదైనా దాడి జరిగినప్పుడు దానిని ఎదుర్కొనేందుకు భారత వాయుసేన యుద్ధ సామగ్రితో పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. అందుకు జవాన్లు కూడా తగిన శిక్షణ పొందారు"

- హర్పరభ్​ సింగ్​, మిగ్​-29 పైలెట్​

సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని లేహ్​ వైమానిక బేస్​ చీఫ్​ ఆపరేటింగ్​ అధికారి ఏ రతి తెలిపారు.

" శత్రుమూకలు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో మా మోహరింపులు పూర్తయ్యాయి. శీతాకాలపు సవాళ్లను అధిగమించేందుకు సిద్ధమవుతున్నాం. మేము విరోధులను సముచితంగా అంచనా వేశాం. అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. వాతావరణంలో మార్పులతో సవాళ్లు పెరుగుతాయి. వైమానిక యోధుల్లో మనోధైర్యం ఎక్కువ. అందుబాటులోని అధునాత సామగ్రి వలన ఎలాంటి విరోధినైనా ఎదుర్కొనేందుకు బలం చేకూరుతుంది. "

- ఏ రతి, చీఫ్​ ఆపరేటింగ్​ ఆఫీసర్​, లేహ్​ ఎయిర్​ ఫోర్స్​ బేస్​. ​

ఇదీ చూడండి: 'రెండు దేశాలతో ఒకేసారి యుద్ధమైనా మేం సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.