ETV Bharat / bharat

కరోనా వల్ల వరుడు లేకుండానే పెళ్లి అయిపోయింది!

author img

By

Published : Mar 20, 2020, 1:39 PM IST

Updated : Mar 21, 2020, 8:11 AM IST

అంగరంగ వైభవంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బంధుమిత్రులందరూ వచ్చేశారు. కానీ, కరోనా కారణంగా వరుడు మాత్రం రాలేదు. అలా అని, పెళ్లి ఆగిపోయిందనుకుంటే పొరపాటే. పెళ్లికొడుకు రాకపోయినా.. పెళ్లి మాత్రం జరిగిపోయింది. అదెలా అంటారా..?

wedding without groom done via video calling due to corona virus in shajahanpur uttarpradesh
కరోనా వల్ల వరుడు లేకుండానే పెళ్లి అయిపోయింది!

కరోనా వల్ల వరుడు లేకుండానే పెళ్లి అయిపోయింది!

కరోనా వైరస్​ పెళ్లిళ్లపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉత్తర్​ప్రదేశ్​ షాజహాన్​పుర్​లో కేవలం కొవిడ్​-19 వల్ల.. పెళ్లికొడుకు లేకుండానే వీడియోకాల్​లో పెళ్లి జరిపించాల్సి వచ్చింది.

అంటా చౌరాహేకు చెందిన తౌసీఫ్​... మారిషస్​లో ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. ఈ మధ్యే నిగోహి కస్బేకు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఈ నెల 19న వారిద్దరికీ నిఖా జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా మారిషస్​ నుంచి భారత్​కు రావల్సిన విమానాలన్నీ రద్దయ్యాయి.

చేసేదేమీ లేక.. నిశ్చయమైన తేదీనే పెళ్లి జరిపించేందుకు వరుడి కుటుంబ సభ్యులంతా కలిసి, వధువు ఇంటికి చేరుకున్నారు. మతపెద్ద మొదట వధువు పెళ్లికి అంగీకరించినట్టు సంతకం చేయించారు. ఆపై, వీడియో కాల్​లో తౌసీఫ్​తో నిఖా కుబుల్​ అనిపించి, పెళ్లి జరిపించేశారు.

"కరోనా కారణంగా మారిషస్​లో విమానాలు రద్దయ్యాయి. ఇక్కడ వధువు కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేశారు. బంధువులందరినీ ఆహ్వానించేశారు. అందుకే ఇరుకుటుంబాలు ముందుగా నిశ్చయమైన తేదీకే ఆన్​లైన్​ వీడియో కాలింగ్​ ద్వారా పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారు. వరుడు తిరిగి ఇంటికి చేరుకోగానే, అప్పగింతల కార్యక్రమం జరుగుతుంది."

-గుడ్డూ ఖాన్​, వరుడి బంధువు

ఇదీ చదవండి:మాస్క్​ లేకుండా తుమ్మినందుకు దేహశుద్ధి!

Last Updated : Mar 21, 2020, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.