ETV Bharat / bharat

62ఏళ్లలో.. ఈ జనవరి చాలా 'హాట్​' - అత్యధిక ఉష్ణోగ్రత

2021 జనవరి గడిచిన 62 ఏళ్లలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదైన నెలగా ఐఎండీ పేర్కొంది. గత నెలలో దేశవ్యాప్తంగా సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రత 14.78 డిగ్రీల సెల్సియస్‌గా ఉందని వివరించింది.

Warmest January in 62 years: IMD
ఈ జనవరి వెరీ హాట్- 62 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత
author img

By

Published : Feb 9, 2021, 6:53 AM IST

ఈ ఏడాది జనవరిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. గత నెలలో దేశవ్యాప్తంగా సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రత 14.78 డిగ్రీల సెల్సియస్‌గా ఉందని వివరించింది. దీంతో 62 ఏళ్లలో ఎన్నడూ లేనంత వేడి జనవరి నెలగా ఇది నిలిచిపోయిందని పేర్కొంది.

దక్షిణ భారతదేశంలో ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని వివరించింది. అక్కడ సరాసరి 22.33 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. 121 ఏళ్లలో జనవరిలో ఎన్నడూ ఆ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి లేదని వివరించింది.

మధ్య భారతదేశంలో సరాసరి 14.82 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైందని, 38 ఏళ్లలో ఇది అత్యధికమని తెలిపింది. అయితే గత నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కన్నా తక్కువగానే ఉన్నాయని వెల్లడించింది.

ఇదీ చదవండి : జలవిలయం: ఆ 197 మంది ఎక్కడ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.