ETV Bharat / bharat

'ఓటు స్లిప్పుల' లెక్కపై రివ్యూ పిటిషన్​ కొట్టివేత - వీవీప్యాట్​

50 శాతం వీవీప్యాట్​ రసీదులు లెక్కించాలన్న విపక్షాల అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టేసింది. లెక్కింపుపై ఏప్రిల్​ 8న ఇచ్చిన తీర్పును మార్చబోమని స్పష్టం చేసింది. 50 శాతం కుదరకపోతే కనీసం 25 శాతం రసీదులు లెక్కించాలని అభ్యర్థించినప్పటికీ కోర్టు అంగీకరించలేదని విపక్షాల తరఫు న్యాయవాది అభిషేక్ మను​ సింఘ్వీ తెలిపారు.

సుప్రీం
author img

By

Published : May 7, 2019, 11:16 AM IST

Updated : May 7, 2019, 2:43 PM IST

ఈవీఎంలపై పిటిషన్​ కొట్టివేత

50శాతం వీవీప్యాట్​ ఈవీఎంల రసీదులు లెక్కించాలన్న విపక్షాల పిటిషన్​ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నియోజకవర్గానికి 5 వీవీప్యాట్​లలోని రసీదులను లెక్కించాలంటూ ఏప్రిల్​ 8న ఇచ్చిన తీర్పును మార్చబోమని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో 21 విపక్ష పార్టీలు వేసిన సమీక్షా వ్యాజ్యంపై ఈమేరకు నిర్ణయం ప్రకటించింది.

విపక్షాలు వెనక్కి తగ్గినా...

50శాతం వీవీప్యాట్​ స్లిప్పులు లెక్కించడంపై విపక్షాలు కాస్త వెనక్కు తగ్గాయి. 21 పార్టీల తరఫున వాదించిన న్యాయవాది అభిషేక్​ మను సింఘ్వీ.. కనీసం 25 శాతం రసీదులైనా లెక్కించాలని సుప్రీంను కోరారు. కానీ సుప్రీంకోర్టు అంగీకరించలేదు.

"మా మొదటి పిటిషన్​కు స్పందిస్తూ నియోజకవర్గానికి 5 వీవీప్యాట్ల రసీదులను లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం సంతోషకరం. మా వాదనలకు అంగీకరించి ఈ తీర్పు ఇవ్వడం అంటే మేము విజయ సాధించినట్టే. నియోజకవర్గానికి 5 వీవీప్యాట్లు అంటే అది 2 శాతమే. మేము అడిగేది ఒక్కటే.. తొలుత 50శాతం వీవీప్యాట్లు లెక్కించాలని కోరాం. ఈ ఎన్నికల్లో కనీసం 33శాతం చేయాలని అభ్యర్థించాం. అదీ కుదరకపోతే కనీసం 25శాతం చేయాలని అడిగాం. కానీ మా వినతిని అంగీకరించకపోవడం దురదృష్టకరం."
--- అభిషేక్​ సింఘ్వీ, విపక్షాల తరఫు న్యాయవాది.

ఇదీ నేపథ్యం...

గతంలో ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ఒక్కో వీవీప్యాట్​ ఈవీఎం రసీదులు లెక్కించేవారు. అయితే... ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాల పనితీరుపై అనుమానాలు వ్యక్తంచేస్తూ 21 విపక్ష పార్టీల నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సార్వత్రిక ఎన్నికల్లో లెక్కించాల్సిన వీవీప్యాట్​ రసీదుల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో 50 శాతం వీవీప్యాట్​ రసీదులను లెక్కించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు.

ఈసీ అభ్యంతరం...

ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక్కో వీవీప్యాట్​లోని రసీదులను లెక్కిస్తున్నామని, ఇదే సరైన పద్ధతి అని కోర్టుకు తెలిపింది ఈసీ. ప్రతిపక్షాలు కోరిన పద్దతి అనుసరించటం సాధ్యపడదని స్పష్టం చేసింది. ప్రస్తుత విధానాన్ని మార్చడానికి తగిన కారణాలను పిటిషనర్లు చూపలేకపోయారని వివరించింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు... నియోజకవర్గానికి 5 వీవీప్యాట్​లలోని రసీదులను లెక్కించాలంటూ ఏప్రిల్​ 8న ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు మళ్లీ సుప్రీంను సంప్రదించాయి. రివ్యూ పిటిషన్​ దాఖలు చేశాయి.విపక్షాల రివ్యూ పిటిషన్​పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. 50శాతం వీవీప్యాట్​ రసీదులు లెక్కించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Seoul - 7 May 2019
1. South Korean Joint Chiefs of Staff media officer Kim Joon-rak walking to podium
2. SOUNDBITE (Korean) Kim Joon-rak, South Korean Joint Chiefs of Staff media officer:
"From 09:06 to 10:55 (local time) on May 4, our military detected multiple short-range projectiles, including 240mm and 30mm multiple rocket launchers and new tactical guided weapons, fired from the Hodo Peninsula of North Hamgyong Province to the East Sea. The short-range projectiles flew 70-240 kilometres at a height of 20-60 kilometres."
3. Wide of news conference
4. SOUNDBITE (Korean) Choi Hyun-soo, South Korean Defence Ministry spokesperson:
"North Korea's launch of multiple projectiles partially goes against the purpose of the (inter-Korean) military agreement and we are very concerned. We urge North Korea to cease actions that heighten military tensions on the Korean Peninsula."
5. Wide of news conference
STORYLINE:
South Korean officials on Tuesday urged North Korea to cease actions that "heighten military tensions" on the peninsula after the North held missile tests on Saturday.
South Korea's Joint Chiefs of Staff (JCS) media officer Kim Joon-rak confirmed that North Korea fired multiple projectiles from the Hodo Peninsula, including new tactical guided weapons, but he did not clarify whether the projectiles included a ballistic missile.
South Korean Defence Ministry spokesperson Choi Hyun-soo said the South was concerned as the launches were a violation of an inter-Korean agreement to cease all hostile acts.
The JCS initially said on Saturday that the North had launched a single missile from the site near the coastal town of Wonsan, but later said in a statement that "several projectiles" had been fired.
North Korean state media on Sunday showed leader Kim Jong Un observing live-fire drills of long-range multiple rocket launchers and what appeared to be a new short-range ballistic missile.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 7, 2019, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.