ETV Bharat / bharat

కరోనాకు తోడుగా కార్చిచ్చు.. వందలాది హెక్టార్లు దగ్ధం - ఉత్తరాఖండ్​లో కార్చిచ్చు

ఉత్తరాఖండ్​లో ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరోవైపు కార్చిచ్చు చెలరేగి వందలాది హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి అయిపోతోంది. మే 23 నుంచి దావానలం తీవ్రత అధికమైందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Uttarakhand wildfire: God's own land witnesses an unstoppable row of losses
కరోనాకు తోడుగా కార్చిచ్చు.. వందలాది హెక్టార్లు దగ్ధం
author img

By

Published : May 27, 2020, 3:03 PM IST

దేవభూమి ఉత్తరాఖండ్​లో కార్చిచ్చు చెలరేగి వందలాది హెక్టార్ల భూమి కాలి బూడిదవుతోంది. రాష్ట్రంలో పలు చోట్ల అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. మే 23 నుంచి దావానలం తీవ్రత అధికమైందని చెబుతున్నారు. కార్చిచ్చు ఈ నెల చివరి వరకు కొనసాగే అవకాశం ఉండవచ్చని అంటున్నారు.

900 హెక్టార్లకు పైగా..

ఈ ఏడాదిలో కుమావున్​, గర్హ్​వాల్ ప్రాంతాల్లో 925 హెక్టార్ల మేర భూమి దావానలం వల్ల ప్రభావితమైందని రాష్ట్ర ప్రధాన అటవీ అధికారి పీకే సింగ్​ తెలిపారు. వందలాది జంతువులు, వేలాది చెట్లు అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం.

అప్పుడు వర్షాలు..

రుతుపవనాల వల్ల ఏప్రిల్​లో భారీ వర్షాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. తర్వాత నెలలోనే అకస్మాత్తుగా కార్చిచ్చు చెలరేగడం వల్ల పర్యావరణ, జీవవైవిధ్యంపై రాష్ట్ర అధికారుల్లో ఆందోళనలు మొదలయ్యాయి.

కరోనాకు తోడుగా కార్చిచ్చు.. వందలాది హెక్టార్లు దగ్ధం

ఇదీ చూడండి: భారత వైమానిక దళంలోకి 'ఫ్లయింగ్​ బుల్లెట్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.