త్వరలోనే భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో భాగంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై అగ్రనేతలు చర్చించారు.
'ఉగ్రవాదాన్ని మోదీ చూసుకుంటారు'
భేటీలో భాగంగా అగ్రనేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన జవాబు.. మోదీకి చిరునవ్వు తెప్పించింది.
ఆల్‌ఖైదాకు పాకిస్థాన్ ఐఎస్ఐ శిక్షణనిచ్చిందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించడంపై ట్రంప్ స్పందన కోరాడు ఓ విలేకరి. అయితే.. 'ప్రధాని మోదీ చూసుకుంటారు' అని బదులిచ్చారు ట్రంప్.
పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే సీమాంతర ఉగ్రవాదాన్ని ఎలా నియంత్రించాలో ప్రధాని మోదీకి బాగా తెలుసని వ్యాఖ్యానించారు ట్రంప్.