ETV Bharat / bharat

10వ తరగతి వాట్సాప్ గ్రూప్​లో అసభ్య ఫొటోలు

ఉత్తర్​ప్రదేశ్‌లో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థుల వాట్సాప్​ గ్రూప్​ అశ్లీల ఫొటోలు, వీడియోలతో నిండిపోయింది. దీనిపై తల్లిదండ్రుల నుంచి పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు అందగా.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సైబర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

UP school WhatsApp group filled with porn, probe ordered
వాట్సాప్ గ్రూప్​లో ఆ ఫొటోలు- కేసు నమోదు
author img

By

Published : Sep 6, 2020, 5:40 PM IST

పదో తరగతి విద్యార్థుల వాట్సాప్​ గ్రూప్​లో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు దర్శనమిచ్చాయి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బాగ్​పత్​​లోని బదౌత్ ​ప్రాంతంలో జరిగింది.

ఇదీ జరిగింది

ఓ ప్రైవేటు పాఠశాలలో 'బయాలజీ గ్రూప్​ క్లాస్​ 10' పేరుతో వాట్సాప్​ గ్రూప్​ను సృష్టించారు. అందులోని అసభ్య ఫొటోలు చూసి నివ్వెరపోయిన తల్లిదండ్రులు..​ స్క్రీన్​షాట్లు తీసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. గ్రూప్​ క్రియేట్ చేసిన నిందితుడు... విద్యార్థుల ఫొటోలను కూడా అడిగినట్లు ఉందని, అయితే ఎటువంటి చిత్రాలు అడుగుతున్నాడో స్పష్టంగా తెలియలేదన్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరపగా.. ఇది నకిలీ గ్రూప్​ అని స్పష్టమైంది. నిందితుడు ముందు జాగ్రత్తగా విదేశీ నెంబరుతో గ్రూప్​ సృష్టించడం వల్ల ఎవరనేది తెలియలేదు. ప్రొఫైల్​లో ఆ పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడి ఫొటో ఉంచడం, గ్రూప్​లో ఉన్న సభ్యుల ఆధారంగా.. తెలిసినవారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఆ బయాలజీ టీచర్​కు తెలియకపోవడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. బదౌత్ సైబర్​ క్రైమ్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: భర్తను చంపి.. గేదె శవమంటూ పూడ్చిపెట్టి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.