ఉత్తరప్రదేశ్ బలరాంపుర్లో ఘోర ప్రమాదం జరిగింది. విష్ణుపుర్లోని ఓ ప్రాథమిక పాఠశాలపై హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడిన ఘటనలో 50 మంది విద్యార్థులు గాయపడ్డారు. విద్యార్థుల ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదని అధికారులు ప్రకటించారు.
వర్షం కారణంగా..
తీగ పడిన సమయంలో విద్యార్థులు దూరంగానే ఉన్నా.. గత రాత్రి వర్షం పడిన కారణంగా పాఠశాల ప్రాంగణమంతా తడిగా ఉంది. ఫలితంగా విద్యార్థులు విద్యుదాఘాతానికి లోనయ్యారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సీఎం ఆగ్రహం
ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తలపై చర్యలు తీసుకోవాలని మధ్యాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ ఎండీని ఆదేశించారు. బాధిత విద్యార్థులకు వైద్య సదుపాయాలు అందేలా చూడాలని బలరాంపుర్ జిల్లా పాలనాధికారిని ఆదేశించారు.
ఇదీ చూడండి: సర్కారు బడి టూ అంగారకుడి ఒడికి పేర్లు!