భాజపా బహిష్కృత ఎమ్మెల్యే, ఉన్నావ్ అత్యాచార కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన కుల్దీప్ సెంగార్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన జీవిత ఖైదును సవాలు చేస్తూ వ్యాజ్యం దాఖలు చేశాడు.
అయితే అతడి అప్పీలుపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది న్యాయస్థానం. నిబంధనల మేరకు అన్ని అవాంతరాలను అధగమిస్తేనే విచారణకు స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది.
2019 డిసెంబర్ 16న ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేయాలని, డిసెంబర్ 20న బతికి ఉన్నంత కాలం జైలులోనే ఉండాలని పేర్కొంటూ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరాడు సెంగార్.
జీవిత ఖైదు..
అత్యాచారం, అధికార దుర్వినియోగం అభియోగాల కింద సెంగార్‌కు జీవిత ఖైదు, రూ. 25 లక్షల జరిమానా విధిస్తూ డిసెంబర్ 20న తీర్పు ఇచ్చింది కోర్టు. 2017లో జరిగిన ఘటన కారణంగా ఆ తర్వాత చేసిన పోక్సో చట్ట సవరణను అనుసరించి మరణ శిక్ష విధించలేమని వ్యాఖ్యానించింది.
ఇదీ చూడండి: నిర్భయ దోషుల 'ఉరి'పై రాష్ట్రపతి నిర్ణయమే కీలకం!