మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ.. శివసేనను ఆహ్వానించిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్ సావంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఎన్డీఏ కూటమి నుంచి శివసేన బయటకొచ్చేసినట్టేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతు ఇవ్వాలంటే ముందుగా ఎన్డీఏ కూటమి నుంచి ఆ పార్టీ తప్పుకోవాలని స్పష్టం చేసింది ఎన్సీపీ. అలాగే కేంద్ర ప్రభుత్వంలోని అన్ని పదవులకూ సేన నాయకులు రాజీనామా చేయాలని పేర్కొంది. ఎన్సీపీ తాజా ప్రతిపాదనకు శివసేన కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అరవింద్ సావంత్ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: శివసేన కోర్టులోనే 'మహా' బంతి