కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్) హరియాణాలోని గురుగ్రామ్‌లో నిర్వహిస్తున్న 'మెగా ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్'లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
ఉదయం 9:30 గంటలకు కదర్పుర్లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) అధికారుల శిక్షణా అకాడమీని అమిత్ షా సందర్శించారు. తరువాత స్వయంగా మొక్కలు నాటి, వాటికి నీళ్లు పోశారు.
ఈ కార్యక్రమంలో సీఏపీఎఫ్‌కు చెందిన 5 శాఖల అధిపతులు సహా ఇతర కేంద్ర దళాల ప్రముఖులు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు.
"కరోనా మహమ్మారిపై భారత్ సమర్థవంతంగా పోరాడుతోంది. ఇందులో భద్రతా దళాల కృషి ఎంతో ఉంది."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
మంచి లక్ష్యం
సీఏపీఎఫ్ బలగాలు ఈ నెలలో 1.35 కోట్లకు పైగా మొక్కలు నాటడమే లక్ష్యంగా 'మెగా ట్రీ ప్లాంటేషన్' డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాయి.
సీఏపీఎఫ్లో... సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీ ఉప విభాగాలుగా ఉంటాయి. ఈ దళాల్లో సుమారు 10 లక్షల మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. శాంతి భద్రతల నిర్వహణ, సరిహద్దు సంరక్షణ, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ఇవి నిర్వహిస్తుంటాయి.
ఇదీ చూడండి: దేశంలో మరో 28,637 కేసులు.. 551 మరణాలు