ETV Bharat / bharat

ఎస్​బీఐ డూప్లి'కేటు' బ్రాంచ్​.. అవాక్కయిన అధికారులు

ఎస్​బీఐ అంటే... దేశవ్యాప్తంగా నమ్మకమైన బ్యాంకు. విద్యార్థులు, రైతులు, వ్యాపారస్థులు ఇలా లక్షలాది మంది ఖాతాలున్న బ్యాంకు. మరి, అలాంటి బ్యాంకు పేరుతో మోసం జరిగే అవకాశముం​టుందని ఎవరైనా ఊహిస్తారా? అందుకే, ఎవ్వరికీ అనుమానం రాదు కాబట్టే.. ఎస్​బీఐ నకిలీ బ్రాంచ్​ తెరిచారు తమిళనాడుకు చెందిన ముగ్గురు కేటుగాళ్లు. ఆరంభంలోనే.. పోలీసుల చేతికి చిక్కారు.

Unemployed youth and two held for running fake SBI Branch
ఎస్​బీఐ నకిలీ బ్రాంచ్​ తెరిచిన ముగ్గురు మోసగాళ్లు అరెస్ట్​!
author img

By

Published : Jul 11, 2020, 5:45 PM IST

Updated : Jul 11, 2020, 6:01 PM IST

తమిళనాడులో స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఎస్​బీఐ) నకిలీ బ్రాంచ్​ తెరిచిన ముగ్గురు మోసగాళ్లను అరెస్ట్​ చేశారు పోలీసులు.

కడలూర్​ జిల్లా పన్రూటి గ్రామానికి చెందిన కమల్​బాబు ఓ నిరుద్యోగి. తల్లిదండ్రులు మాజీ బ్యాంక్​ ఉద్యోగులు. అమ్మానాన్నల్లాగా తానూ కష్టపడి బ్యాంకులో ఉద్యోగం చేయడమేంటీ, ఏకంగా బ్యాంకే తెరిచేస్తే పోలా అనుకున్నాడో ఏమో.. ఏకంగా నకిలీ బ్రాంచ్​కే స్కెచ్​ వేశాడు.

ఎస్​బీఐ నకిలీ బ్రాంచ్​ తెరిచిన ముగ్గురు మోసగాళ్లు అరెస్ట్​!

ప్రింటింగ్​ ప్రెస్​ ఓనర్​ కుమార్​, రబ్బర్​ స్టాంప్ తయారీదారుడు మణిక్కం సాయంతో.. నకిలీ బ్యాంకు చలాన్లు, రబ్బర్​ స్టాంపులు సృష్టించాడు కమల్​. తరచూ బ్యాంకుకు వెళ్లి, బ్రాంచ్​ ఏర్పాట్లల్లో ఉన్న వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఎస్​బీఐ జోనల్​ మేనేజర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రాంచ్​ ప్రారంభించి.. జనాల డబ్బులు నొక్కేయకముందే నిందితులను అరెస్ట్​ చేశారు తమిళనాడు పోలీసులు.

ఇదీ చదవండి: భారత​ 'పులుల గణన'కు​ గిన్నిస్ రికార్డ్​లో చోటు

Last Updated : Jul 11, 2020, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.