ETV Bharat / bharat

అమర వీరులకు నివాళిగా 'భారత యాత్ర-2'

ఉగ్రదాడుల్లో అమరులైన జవాన్లకు నివాళిగా 'భారత యాత్ర'కు శ్రీకారం చుట్టారు కర్ణాటకవాసి గోపినాథ్​ జాదవ్​. ఈ యాత్రలో.. జవాన్ల సమాధి వద్ద ఉండే మట్టిని సేకరించి భారత చిత్రపటాన్ని రూపొందిస్తానని తెలిపారు జాదవ్​.

author img

By

Published : Nov 5, 2020, 7:38 PM IST

Umesh Gopinath Jadhav Moves to Bharat Yatra in Tribute of Pulwama Martyrs
అమర వీరులకు నివాళిగా 'భారత యాత్ర-2'

కార్గిల్​ యుద్ధం, పుల్వామా ఉదంతంతో పాటు ఇతర ఉగ్రదాడుల్లో అమరవీరులైన జవాన్లకు నివాళిగా 'భారత యాత్ర'ను చేపట్టారు కర్ణాటక బెంగళూరుకు చెందిన ఉమేశ్​ గోపినాథ్​ జాదవ్​. వృత్తిపరంగా సంగీతకారుడే అయినప్పటికీ.. గుండెల నిండా దేశభక్తి ఉండటం వల్ల ఈ యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు జాదవ్​.

నిజానికి ఇలా యాత్ర చేపట్టడం జాదవ్​కు ఇది రెండోసారి. 2019 ఏప్రిల్​ 9- 2020 ఏప్రిల్​ 9 వరకు తొలి దశ భారత యాత్ర నిర్వహించారు జాదవ్​. ఆ పర్యటనలో 65వేల కిలోమీటర్లు ప్రయాణించి.. 98మంది అమర వీరుల ఇళ్లను సందర్శించారు. సైనికుల తల్లిదండ్రులతో మాట్లాడారు. వారి సమాధుల వద్ద ఉన్న మట్టిని సేకరించారు. ఈ దఫా యాత్రలోనూ మట్టిని సేకరిస్తానని వెల్లడించారు జాదవ్​.

పోలీసుల సత్కారం

గతంలో ఓ జవాను కుటుంబసభ్యులతో

మట్టితో మ్యాప్​..

అమర వీరుల సమాధుల వద్ద సేకరించిన మట్టితో.. జమ్ముకశ్మీర్​లో నిర్మిస్తున్న సైనిక స్మారకంలో ఇండియా మ్యాప్​ను రూపొందిస్తానని తెలిపారు జాదవ్​. ఇదే కారణంగా యాత్ర చేపట్టినట్టు పేర్కొన్నారు.

"జన్మభూమి-కర్మభూమి పేరుతో తొలుత ఈ యాత్రను మొదలు పెట్టాను. మార్చి నెలలో నేను ఛత్తీస్​గఢ్​లోని సుక్మాలో ఉన్నప్పుడు కరోనా లాక్​డౌన్​ విధించారు. దీంతో నా యాత్ర ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టాను. అమరవీరుల సమాధి వద్ద ఉండే మట్టితో భారత చిత్రపటాన్ని తయారుచేయడమే నా లక్ష్యం."

--- ఉమేశ్​ గోపినాథ్​ జాదవ్​, సంగీతకారుడు.

మారుతి-800 వాహనాన్ని తన ప్రయాణానికి అనుగుణంగా మార్చుకుని దేశ యాత్ర చేపట్టారు జాదవ్​. ఈ సంగీతకారుడి దేశభక్తిని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డా. అశ్వత్​ నారాయణ్​ ప్రశంసించి.. యాత్ర విజయవంతమవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

మారుతి-800లో యాత్ర

డిప్యూటీ సీఎంతో జాదవ్​

ఇదీ చూడండి:- 'యుద్ధ సామర్థ్యం ఉంటేనే శాంతి స్థాపన సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.