పంజాబ్ సంగ్రూర్ జిల్లా భగవాన్పురలో రెండేళ్ల బాలుడు ఫతేవీర్ మృత్యువుకు తలొగ్గాడు. ఈ నెల 6న బోరుబావిలో పడిన చిన్నారి ఫతేవీర్ను సహాయక బృందాలు దాదాపు 5 రోజులపాటు నిర్విరామంగా శ్రమించి బయటకు తీశాయి. బోరుబావి నుంచి బయటకు తీసిన అనంతరం బాలుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
తన పుట్టిన రోజైన ఈ నెల 6న ఇంట్లో ఆడుకుంటూ పక్కనే ఉన్న బోరుబావిలో పడ్డాడు ఫతేవీర్. అప్పటి నుంచి ఆ చిన్నారిని రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం, పాటియాల సాయుధ ఇంజినీర్ల రక్షణ దళాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. దాదాపు 110 గంటల అనంతరం బోరుబావి నుంచి బాలుడిని వెలికితీసాయి. ఇంత శ్రమించినా బాలుడు దక్కలేదు.
ఇదీ చూడండి : 5 రోజులుగా బోరుబావిలోనే పంజాబ్ చిన్నారి