ETV Bharat / bharat

'తిండి లేదు... బీర్లతోనే సరిపెట్టుకుంటున్నాం సార్' - funny incidents in lockdown period in india

రాజస్థాన్​లో మాజీ మంత్రినే బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు బిహార్​కు చెందిన ఇద్దరు యువకులు. లాక్​డౌన్​ కారణంగా ఆకలితో అలమటిస్తున్నామంటూ ట్విట్టర్​లో పోస్ట్​ చేసి... ఇంట్లో బీర్​ పార్టీ చేసుకుంటూ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.

Two bihar resident make false call to former minister for food while lockdown in rajasthan, both were drunked
'సార్​.. తినడానికి తిండిలేక బీర్లతో ​దాహం తీర్చుకుంటున్నాం!'
author img

By

Published : Apr 1, 2020, 4:15 PM IST

"సార్​.. లాక్​డౌన్​ కారణంగా మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా దగ్గరున్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. ఇప్పుడు మా దగ్గర రేషన్​ బియ్యం కొనుగోలు చేసేందుకు చిల్లిగవ్వ అయినా లేదు. దయచేసి మీరే మాకు సాయం చేయండి....." అంటూ పుట్టెడు దుఃఖంతో వేడుకున్న ఇద్దరు బిహార్ యువకులు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.

'సార్​.. తినడానికి తిండిలేక బీర్లతో ​దాహం తీర్చుకుంటున్నాం!'

మాజీ మంత్రిని అభ్యర్థించి...

రాజస్థాన్​ భివాండీలో​ బిహార్​కు చెందిన జితేశ్​ రాజ్​పుత్, ఉమేశ్​ అనే ఇద్దరు ఆకతాయిల బండారం బయటపడింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్​డౌన్​ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధ పడొద్దని ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. ఇదే అదనుగా లాక్​డౌన్​ కారణంగా ముప్పతిప్పలు పడుతున్నామంటూ...రాజస్థాన్​ మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా ట్విట్టర్​ ఖాతాకు మెసేజ్​ చేశాడు ఉమేశ్​.

ఉమేశ్​ పోస్ట్​కు స్పందించిన మాజీమంత్రి ఆ మెసేజ్​ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. సీఎంఓ ఆదేశం మేరకు అధికారులు బాధితులకు నెలవారి సామగ్రిని అందించేందుకు సర్వం సిద్ధం చేశారు. స్వయంగా స్థానిక తహసీల్​దార్ వీరి​ ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. ఇంకేముంది, అక్కడ సీన్​చూసి అవాక్కయ్యారు. తినడానికి తిండి లేదని మొరపెట్టుకున్న వీరు బీరు సీసాలు ముందేసుకుని పార్టీ చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయారు.

"ఓ వ్యక్తి రెండు, మూడు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారని సీఎం​ఓకు సందేశం వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మేము బిహార్​కు చెందిన ఆ యువకుల ఇంటికి వెళ్లి చూశాం. ఇంట్లో దాదాపు 15-20 రోజులకు సరిపడా సరుకులు ఉన్నాయి. మందు సీసాలు ఉన్నాయి. ఇలా అవసరం లేకపోయినా అబద్ధాలు చెప్పి సాయం కోరడం వల్ల ప్రయోజనం ఉండదు. వీరి వల్ల నిజంగా అవసరమున్నవారికి సాయం అందట్లేదు. "

-అరవింద్​ కివియా, తహసీల్దార్​

సామాజిక మాధ్యమాల్లో ఇలా ఉత్తుత్తి పోస్టులు చేసి.. అధికారుల సమయాన్ని వృథా చేసినందుకు ఉమేశ్​, జితేశ్​పై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదీ చదవండి:మద్యం ప్రియులను 'ఏప్రిల్​ ఫూల్స్​' చేసిన వైన్​ షాపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.