జమ్ముకశ్మీర్ ఉధంపుర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జవాన్లు ప్రయాణిస్తోన్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదంలో తీవ్ర గాయాలైన సైనికులను ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.