ETV Bharat / bharat

ఠాణాలోనే చెంప చెళ్లుమనిపించిన కాంగ్రెస్ నేత - 'పీపుల్స్​ ఫ్రంట్​ ఆఫ్​ త్రిపుర'

తన సోదరి కాన్వాయ్​పై దాడికి పాల్పడిన ఓ ఐపీఎఫ్​టీ కార్యకర్తపై పోలీసు స్టేషన్​లోనే త్రిపుర కాంగ్రెస్​ అధ్యక్షుడు​ చెంప దెబ్బ కొట్టారు. ఈ వీడియోను భాజపా మంత్రి రతన్​లాల్​ సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.

ఠాణాలోనే చెంప చెళ్లుమనిపించిన త్రిపుర కాంగ్రెస్ అధ్యక్షుడు
author img

By

Published : Apr 19, 2019, 6:16 AM IST

Updated : Apr 19, 2019, 8:08 AM IST

ఠాణాలోనే చెంప చెళ్లుమనిపించిన కాంగ్రెస్ అధ్యక్షుడు

త్రిపుర కాంగ్రెస్​ అధ్యక్షుడు ప్రద్యోత్​ దేవ్​ బర్మన్​ వివాదంలో చిక్కుకున్నారు. స్థానిక 'పీపుల్స్​ ఫ్రంట్​ ఆఫ్​ త్రిపుర' పార్టీ కార్యకర్తను పోలీసు స్టేషన్​లోనే చెంపదెబ్బకొట్టారు. ఈ వీడియోను భాజపా పార్టీ నేత, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి రతన్​లాల్​ నాథ్​ విడుదల చేశారు. త్రిపురలో భాజపా, ఐపీఎఫ్​టీ ఉమ్మడిగా ఎన్నికల బరిలో నిలిచాయి.

ఇటీవల ఖోయ్​ జిల్లాలోని ఓ కుగ్రామంలో ప్రచారం చేస్తున్న ప్రద్యోత్​ దేవ్​ సోదరి ప్రజ్ఞ్య దేవి బర్మన్​ కాన్వాయ్​పై ఐపీఎఫ్​టీ కార్యకర్త ఇటుకరాయితో దాడికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆవేశానికిలోనైన ప్రద్యోత్​.. నిందితునిపై చేయి చేసుకున్నారు.

త్రిపుర లోక్​సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజ్ఞ్యదేవి పోటీచేస్తున్నారు.

ఇదేం తీరు

ప్రద్యోత్​ చర్యను భాజపా నేత రతన్​ లాల్​ తీవ్రంగా ఖండించారు. త్రిపుర కాంగ్రెస్ అధ్యక్షుడు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు.
"పోలీసు స్టేషన్​లోనే ఓ వ్యక్తిపై చేయిచేసుకున్న ప్రద్యోత్​.. ఎవర్నైనా, ఎక్కడైనా చంపగలరు" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆకతాయిని భాజపా సమర్థిస్తుందా?

మరోవైపు ప్రద్యోత్ తన చర్యను సమర్థించుకున్నారు. క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు. నా సోదరిపై దాడికి పాల్పడిన ఓ ఆకతాయిని భాజపా సమర్థిస్తోంది. అతడ్ని కాపాడడానికి భాజపా ఎందుకు ప్రయత్నిస్తోందో తెలపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనను జైలులో పెడితే బెయిల్​కు కూడా ప్రయత్నించనని తెలిపారు.

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
Last Updated : Apr 19, 2019, 8:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.