చెట్టు కాండంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని గీసి అబ్బురపరిచాడు ఒడిశాకు చెందిన చిత్రకారుడు. చెట్ల నరికివేతను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మయూర్భంజ్కు చెందిన సమరేంద్ర బెహెరా ఈ చిత్రానికి జీవం పోశాడు. సిమిలిపాల్ జాతీయ పార్కులోని ఓ వృక్షంపై ఈ మోదీ ముఖాన్ని చెక్కాడు.
"అడవిలో అక్రమ చెట్ల నరికివేతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ చిత్రం ద్వారా మోదీకి సందేశం ఇస్తున్నా. ఒడిశా మయూర్భంజ్ జిల్లాలో నేనొక చిన్న కళాకారుడిని. ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలవలేనని నాకు తెలుసు. అందుకే ఈ ప్రయత్నం చేశా."
-సమరేంద్ర బెహెరా, కళాకారుడు
ఇదివరకు కూడా పలువురు ప్రముఖుల ముఖచిత్రాలను చెట్లపై అందంగా తీర్చిదిద్దాడు సమరేంద్ర. దేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 89వ జయంతి సందర్భంగా ఆయన.. చిత్రాన్ని రూపొందించాడు.
ఇదీ చదవండి: భళా సమరేంద్ర: చెట్టు కాండంపై దర్శనమిచ్చిన 'కలాం'