ETV Bharat / bharat

దిల్లీకి వెళ్లట్లేదు- టీఎంసీతోనే ఉంటా: శతాబ్ది రాయ్ - పార్టీతో శతాబ్ది రాయ్ విబేధాలు

దిల్లీ పర్యటనకు శనివారం వెళ్లనున్నట్లు ఫేస్​బుక్​లో పోస్ట్ చేసిన బీర్భుమ్ తృణమూల్​ ఎంపీ శతాబ్ది రాయ్ తాజాగా తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు. తృణమూల్​ సీనియర్ నేత అభిషేక్​ బెనర్జీతో చర్చ అనంతంరం ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్​ పార్టీ విడిచి వెళ్లనని, పార్టీ అంతర్గత సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు.

satabdi roy facebook posts raises tension in TMC
శతాబ్ది రాయ్‌ దీదీకి షాక్‌ ఇవ్వబోతున్నారా!
author img

By

Published : Jan 15, 2021, 10:04 PM IST

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ కీలక సమయంలో అనేక మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు పార్టీని వీడుతున్నారు. రాష్ట్రంలో బలీయమైన శక్తిగా అవతరిస్తున్న భాజపాలో చేరుతున్నారు. దీంతో తృణమూల్‌ - భాజపా నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఎంపీ శతాబ్ది రాయ్‌ కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న ఆమె శనివారం.. దిల్లీకి వెళ్తున్నట్టు పేర్కొంటూ చేసిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చర్చనీయాంశంగా మారింది.

టీఎంసీతోనే..

అయితే పార్టీ సీనియర్​ నేత అభిషేక్​ బెనర్జీతో చర్చించిన అనంతరం శతాబ్ది రాయ్ తన దిల్లీ పర్యటనపై స్పష్టత ఇచ్చారు. తృణమూల్​ పార్టీని విడిచి వెళ్లనని వ్యాఖ్యానించారు.

satabdi roy
శతాబ్ది రాయ్

ఏమైందంటే..

తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటంపై ఎదురవుతున్న ప్రశ్నలకు శతాబ్ది రాయ్‌ తన ఫ్యాన్స్‌ క్లబ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా సమాధానమిచ్చారు. తద్వారా పార్టీతో తనకున్న ఇబ్బందులను బయటపెట్టారు. ముందుగా పార్టీ కార్యక్రమాల షెడ్యూల్‌ను తెలియపరచకపోవడం వల్లే హాజరు కాలేకపోతున్నానని పేర్కొన్నారు. ఇది తనను ఎంతో మానసిక వేదనకు గురిచేస్తోందని అన్నారు. మూడు సార్లు బీర్భుమ్‌ ఎంపీగా ఎన్నికైన సినీనటి శతాబ్ది రాయ్‌.. శనివారం దిల్లీ పర్యటనకు వెళ్తున్నట్టు ప్రకటించారు. తాను తీసుకోబోయే ఏ నిర్ణయమైనా శనివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలుస్తుందని తొలుత ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాతే తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు.

మానసిక వేదనకు గురవుతున్నా..

"నియోజకవర్గంతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. కానీ పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారని చాలా మంది అడుగుతున్నారు. వారందరికీ నేను ఒకటే చెప్పదలచుకున్నా.. అన్ని కార్యక్రమాలకు హాజరుకావాలనుకుంటున్నా. కానీ, నాకు పార్టీ కార్యక్రమాల గురించి ఎలాంటి సమాచారం ఉండటంలేదు. అలాంటప్పుడు ఎలా హాజరుకాగలను? ఈ పరిస్థితితో ఎంతో మానసికంగా వేదనకు గురవుతున్నా."

-శతాబ్ది రాయ్, బీర్భుమ్​ ఎంపీ.

గత 10 ఏళ్లుగా తన సొంత కుటుంబానికి కంటే ఎక్కువ సమయం నియోజకవర్గ ప్రజలతోనే గడుపుతున్నానన్నారు శతాబ్ది. ఈ ఏడాది కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకున్నానని, మొత్తం సమయం ప్రజలతోనే ఉండాలనుకున్నట్టు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు 2009 నుంచి తనకు మద్దతుగా నిలుస్తున్నారని.. రానున్న రోజుల్లోనూ అలాగే ఉంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

దిల్లీ పర్యటన సందర్భంగా భాజపాలో చేరే అవకాశం ఉందా అనే ప్రశ్నలపై స్పందించేందుకు నిరాకరించారు. దిల్లీ వెళ్తున్నానంటే దానర్థం భాజపాలో చేరేందుకు కాదని, తాను ఎంపీ గనక దిల్లీ వెళ్లొచ్చని సమాధానం చెప్పారు. అనంతరం.. అభిషేక్​ బెనర్జీతో మాట్లాడాక దిల్లీ వెళ్లట్లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:వయసు 22 ఏళ్లు.. పెళ్లిళ్లు 11..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.