ETV Bharat / bharat

ముఫ్తీకి షాక్‌.. పార్టీకి ముగ్గురు రాజీనామా

author img

By

Published : Oct 26, 2020, 8:20 PM IST

పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. త్రివర్ణపతాకాన్ని ఉద్దేశిస్తూ ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పీడీపీకి రాజీనామా చేశారు.

Three-Leaders-Quits-PDP-over-Mehbooba-Muftis-Remarks
ముఫ్తీకి షాక్‌.. పార్టీకి ముగ్గురు రాజీనామా

జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి షాక్‌ తగిలింది. జాతీయ జెండానుద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు సోమవారం పార్టీని వీడారు. ఆమె చేతల వల్ల పార్టీలో ఇమడలేకపోతున్నామని, ముఖ్యంగా దేశభక్తి విషయంలో మనోభావాలు దెబ్బతీసేలా ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల తాము పార్టీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు టీఎస్‌ బజ్వా, వేద్‌ మహాజన్‌, హుస్సేన్‌ ఏ వప్ఫా ఆమెకు రాజీనామా లేఖలు పంపారు.

ఆర్టికల్‌ 370 రద్దుతో ఉనికి కోల్పోయిన జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక జెండాను ఐక్య పోరాటంతో తిరిగి సాధించుకుంటామని ముఫ్తీ ఇటీవల అన్నారు. ఈ క్రమంలో ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగురవేస్తామని చెప్పారు. దీంతో ఆమె వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.

జాతీయ జెండాను అవమానించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఆ పార్టీని ముగ్గురు నేతలు వీడడం గమనార్హం.

ఇదీ చూడండి: 'స్వార్థ ప్రయోజనాల కోసం భారత్ యుద్ధం చేయదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.