ట్రాన్స్జెండర్స్.. సమాజంలో సరైన గౌరవం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. విద్యా, ఉద్యోగాల్లో సముచిత స్థానం కావాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆత్మగౌరవంతో బతకాలంటే.. చదువు ఒక్కటే మార్గంగా తలచింది మహారాష్ట్ర జల్నా జిల్లాలోని ట్రాన్స్జెండర్ల బృందం. తమ లాంటి వారి కోసం ఏదోఒకటి చేయాలని సంకల్పించుకుంది.
జల్నా జిల్లాలో కోటి రూపాయలతో నూతన భవనం నిర్మించారు ట్సాన్స్జెండర్లు. ఈనెల 30న గృహ ప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ లాంటి వారికి ఇందులో ఆశ్రయం కల్పించి.. ఉన్నతంగా ఎదిగేందుకు సాయపడతామని చెబుతున్నారు.
చిన్నతనంలోనే కుటుంబాలు వెలివేసినా.. తామంతా కలిసికట్టుగా ఓ కుటుంబంలా ఉంటున్నట్లు చెబుతోంది ట్సాన్స్జెండర్ కాజోల్. తమలో ఉన్నవారితో పాటు కొత్త తరం వారు కూడా తప్పనిసరిగా చదువుకోవాలని సూచిస్తోంది.
"మాలో కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు న్యాయవాదులు, పోలీసులు, రాజకీయ నాయకులుగా ఉన్నారు. అలాంటిదే మేము కోరుకుంటున్నాం. గొప్ప స్థానంలోకి వెళ్లేంత శక్తి ఉన్న వారు మేము చదువుకుంటామని దేశానికి చెప్పండి. అలాంటి వారి కోసం మేము ఇదంతా చేస్తున్నాం. మా లాంటి వారు మంచి పనులు చేస్తుండటం మాకు సంతోషమే. వారంతా బాగుంటే మేము బాగున్నట్లే. వారు సంతోషంగా ఉంటే మేమూ ఉన్నట్లే. ఇక్కడ చదువు చెప్పేందుకు ఓ ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం."
- కాజోల్, ట్రాన్స్జెండర్.
ఇదీ చూడండి: ఆ జంట పెళ్లికి గోమాతే ముఖ్య అతిథి