ETV Bharat / bharat

ఆ పరీక్షలు చేయించుకుంటేనే పార్లమెంట్​లోకి ఎంట్రీ - పార్లమెంట్​ కరోనా వైరస్​

పార్లమెంట్​ సమావేశాలకు ముందు ఎంపీలకు, సందర్శకులకు థర్మల్​ స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహించారు అధికారులు. దేశంలో కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తొన్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులోనూ ఇదే తరహా పరీక్షలు నిర్వహించారు.

THERMAL SCREENING CONDUCTED IN PARLIAMENT
ఆ పరీక్షలు చేయించుకుంటేనే పార్లమెంట్​లోకి ఎంట్రీ
author img

By

Published : Mar 16, 2020, 1:04 PM IST

Updated : Mar 16, 2020, 3:08 PM IST

ఆ పరీక్షలు చేయించుకుంటేనే పార్లమెంట్​లోకి ఎంట్రీ

కరోనా వైరస్​ సెగ పార్లమెంట్​ సమావేశాలనూ తాకింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎంపీలు, సందర్శకులకు థర్మల్​ స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు చేయించుకుంటేనే పార్లమెంట్​లోకి అడుపెట్టనిస్తున్నారు అధికారులు.

thermal-screening-conducted-in-parliament
స్క్రీనింగ్​ పరీక్షలు

కరోనా వైరస్​పై పోరులో భాగంగానే ఈ చర్యలు చేపట్టింది కేంద్రం. ఇప్పటికే దేశంలోని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో ఈ స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా అనుమానితులను తక్షణమే నిర్బంధ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తోంది.

పార్లమెంట్​ ప్రాంగణంలో

థర్మల్​ స్క్రీనింగ్​ ఇలా..

సుప్రీంలోనూ...

కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తొన్న తరుణంలో సుప్రీంకోర్టు ప్రాంగణంలోనూ స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సభ్యుల శరీర ఉష్ణోగ్రత రికార్డు చేశారు.

కోర్టు ప్రాంగణంలో అనవసరంగా గుమిగూడవద్దని అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మ్యూజియంను మూసివేసింది. సందర్శకులను కూడా అనుమతించడం లేదు. అత్యవసర వ్యాజ్యాలను మాత్రమే విచారించనున్నట్టు స్పష్టం చేసింది.

న్యాయవాదికి..

సుప్రీం ప్రాంగణంలో

కేంద్రమంత్రుల భేటీ...

దిల్లీలోని నిర్మాణ్​ భవన్​లో కేంద్రమంత్రులు భేటీ అయ్యారు. దేశంలో కరోనా వైరస్​కు అడ్డుకట్ట వేయడం సహా ఇతర ముఖ్య అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్​, విదేశాంగశాఖ మంత్రి జైంకర్​ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:- కరోనా గురించి ఈ 10 విషయాలు తెలుసా?

Last Updated : Mar 16, 2020, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.