భారతకు శత్రువును ఎదుర్కోవటం ఎలాగో తెలుసని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. లద్దాఖ్‌లోని భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకున్న వారికి భారత సైన్యం దీటైన సమాధానం చెప్పిందన్నారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనా మధ్య ఇటీవల జరిగిన ఘర్షణపై మనసులో మాట (మన్ కీ బాత్) కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యం సత్తా చాటిందని పేర్కొన్నారు.
" దేశ సరిహద్దులను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవడంలో భారత్ నిబద్ధతను ప్రపంచ మొత్తం చూసింది. లద్దాఖ్‌లో మన సైనికులు తమ శౌర్యం ఎలాంటిదో చూపించారు. రక్షణ రంగంలో మన దేశం ఇప్పుడు అనేక దేశాల కంటే ముందుంది. మనదగ్గర అనేక యుద్ధ పరిశ్రమలు ఉన్నాయి. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
భారత్‌కు ఇతర దేశాలతో ఎలా వ్యవహరించాలో తెలుసని.. అదే సమయంలో ఎవరైనా సమస్యలు సృష్టించాలని చూస్తే వారిని ఎదుర్కోవటం కూడా తెలుసునన్నారు మోదీ. మన వీర సైనికులు అదే చూపించారని చెప్పారు. తన మాతృదేశానికి ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే వారు చూస్తూ ఊరుకోరని పేర్కొన్నారు మోదీ. లద్దాఖ్‌లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు దేశం మొత్తం నివాళులర్పిస్తోందన్నారు.