ETV Bharat / bharat

అక్కడి పంచాయతీ ఎన్నికల బరిలో ఓ 'యాచకుడు' - Ankankayaka participated in Gram Panchayath Elections

ఓ యాచకుడు గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలవనున్నాడు. అవును.. మీరు చదివింది నిజమే. కర్ణాటకలోని ఓ ఊరిలో ఎవరు గెలిచినా అభివృద్ధి జరగట్లేదని భావించిన గ్రామస్థులు.. ఓ ప్రసిద్ధ కన్నడ సినిమా స్ఫూర్తితో ఇలా బిక్షగాడిని పోటీలో నిలిపారు.

The villagers made Beggar fight gram panchayath election inspired by a famous movie
అక్కడి పంచాయతీ ఎన్నికల బరిలో ఓ 'యాచకుడు'!
author img

By

Published : Dec 21, 2020, 7:51 PM IST

Updated : Dec 21, 2020, 8:18 PM IST

కర్ణాటక మైసూర్​ జిల్లాలోని నంజనగుడ ప్రాంతంలో ఓ యాచకుడు ఈ సారి జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. గ్రామంలో అభివృద్ధిని కోరుతూ ఇలా వినూత్నంగా అతడితో నామినేషన్​ వేయించేందుకు సన్నద్ధమయ్యారు ఆ ఊరి ప్రజలు. విష్ణువర్ధన్​ కథానాయకుడిగా నటించిన 'సింహాద్రీయ సింహ' కన్నడ సినిమా స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

The villagers made Beggar fight gram panchayath election inspired by a famous movie in Karnataka
అంకంకయకను సన్నానిస్తున్న గ్రామస్థులు

ఈ మేరకు అంకంకయక అనే ఓ యాచకుడ్ని ఎన్నుకొన్నారు బొక్కహల్లి ప్రజలు. రోజూ భిక్షాటన ద్వారా కడుపు నింపుకునే అతడు.. బస్టాండ్​లో తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్నాడట. ఏళ్ల తరబడి ఇలాగే బతుకీడుస్తున్న అంకంకయక.. ఆ ఊరి ప్రజల వినూత్న ఆలోచనతో ఒక్కసారిగా హీరో అయిపోయాడు. నామినేషన్ వేసేందుకు ఓ కారును సిద్ధం చేసి.. దర్జాగా అతడ్ని సాగనంపారు స్థానికులు.

నామినేషన్​ వేసేందుకు కారులో వెళ్తున్న అంకంకయక

అంకంకయకతో స్థానిక పిల్లలు

ఇదీ చూడండి: నడిరోడ్డుపై దారుణం- యువతిపై కత్తితో దాడి

Last Updated : Dec 21, 2020, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.