సెప్టెంబర్ 1వ తేదీ నాటికి వెనుదిరగాల్సిన నైరుతి రుతుపవనాలు ఒక నెల ఆలస్యంగా అక్టోబర్ 9 నుంచి తిరోగమనం ప్రారంభించాయి. ఇప్పటికే పంజాబ్, హరియాణ, ఉత్తర రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి వైదొలిగాయి.
రాబోయే రెండు రోజులలో వాయవ్య భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి, తరువాత 2-3 రోజులలో మిగిలిన ప్రాంతాల నుంచి, మధ్య భారతదేశానికి ఆనుకొని ఉన్న ప్రదేశాల నుంచి రుతుపవనాలు వైదొలిగే పరిస్థితులు కనిపిస్తున్నట్లు శాఖ తెలిపింది.
రుతుపవనాలు ఇంత ఆలస్యంగా వెనుదిరగడం చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో 1961లో, 2007లో నైరుతి రుతుపవనాలు నెల రోజులు ఆలస్యంగా తిరిగి వెళ్లాయి.
ఇదీ చూడండి:తాగొచ్చి గొడవ చేస్తున్నాడని అన్నను మట్టుబెట్టాడు..