కేరళ వయనాడ్లో ఓ పనస పండు ఇప్పుడు గిన్నిస్ రికార్డు కైవసం చేసుకోనుంది. అక్షరాలా 52 కిలోల 360 గ్రాముల బరువు, 117 సెంటిమీటర్ల పొడవు, 77సెంటీమీటర్ల చుట్టుకొలతతో ప్రపంచంలోనే భారీ పనసగా గుర్తింపు పొందనుంది.
మనంతవాడి సమీపంలోని కప్పటములలో పండిందీ పనస. గ్రామ పంచాయతీ సభ్యులు గిన్నిస్ అధికారులకు కబురెట్టారు. ఇందుకు కావలసిన పత్రాలను గిన్నిస్ సంస్థకు పంపారు స్థానిక వ్యవసాయాధికారి. ఇక ఆ అధికారులు వచ్చి పరీక్షించి నిర్ధరించడమే ఆలస్యం.
రేసులో మరొకటి...
అయితే, కేరళ కొల్లం జిల్లాలో 52 కిలోల పనసకు పోటీగా మరో పనస పండింది. ఇదాములక్కళ్ అంజళ్కు చెందిన జానీకుట్టీ పెరట్లో పండిన ఈ వారిక్క రకం పనసపండు 51 కిలోల 500 గ్రామల బరువు, 97 సెంటిమీటర్ల పొడవు ఉంది. దీంతో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అధికారులకు సమాచారమిచ్చాడు జానీకుట్టి.
ఇప్పటివరకు పుణెలో పండిన 42.73 కిలోల బరువు, 57 సెంటిమీటర్ల పొడవుగల పనసే ప్రపంచంలోకెల్లా పెద్ద పనస. ఇప్పుడు ఆ రికార్డును బద్దలగొట్టేందుకు రెండు కేరళ పండ్లు సిద్ధమయ్యాయి.
ఇదీ చదవండి:బండికి తానే ఓ కాడెద్దైన వలస కార్మికుడు