జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 9 ఏళ్ల బాలుడు, జవాను ప్రాణాలు కోల్పోయారు.
బిజ్బెహరా ప్రాంతంలోని పద్షాహీ బాగ్ వంతెన వద్ద గస్తీ విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. ఈ దాడిలో ఒక బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాయపడ్డ జవానును అనంత్‌నాగ్ జిల్లా ఆస్పత్రికి తరలించగా... కాసేపటికే మరణించారు.
దాడి చేసిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.